CBDT- IT Department | భారీ క్యాష్ పేమెంట్స్‌పై ఫోకస్.. పన్ను ఎగవేతపై ఐటీ విభాగానికి సీబీడీటీ ఆదేశం.. !
CBDT- IT Department | భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరుగుతున్న హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ సేల్స్, దవాఖానలు, ఐవీఎఫ్ క్లినిక్స్‌ల్లో లావాదేవీలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఐటీ విభాగానికి సీబీడీటీ నొక్కి చెప్పింది.
CBDT- IT Department | ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ మయం అయ్యాయి. ఆయా లావాదేవీల పరిధి దాటితే పన్ను భారం పడుతుంది. అన్ని లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నా.. నగదు లావాదేవీలు గణనీయంగానే సాగుతున్నాయి. ఈ విషయమై దృష్టి సారించాలని ఆదాయం పన్ను విభాగం (Income Tax Department)ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (Central Board of Direct Taxes – CBDT) ఆదేశించింది. ప్రత్యేకించి హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ సేల్స్, దవాఖానలు, ఐవీఎఫ్ క్లినిక్స్‌ల్లో లావాదేవీలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఐటీ విభాగానికి సీబీడీటీ నొక్కి చెప్పింది. సంబంధిత వర్గాల వారికి ఇబ్బంది కలగని రీతిలో తనిఖీ చేయాలని హితవు చెప్పింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోలిస్తే పన్ను ఎగవేత వసూళ్లు పెరగాలని స్పష్టం చేసింది.
హోటళ్లు, వేడుకలు నిర్వహించే బాంక్విట్ హాళ్లు, లగ్జరీ బ్రాండ్ రిటైలర్లు, ఐవీఎఫ్ క్లినిక్స్, హాస్పిటళ్లు, డిజైనర్ క్లాథింగ్ స్టోర్లలో లావాదేవీలు, ఎన్ఆర్ఐ కోటా మెడికల్ సీట్ల ఫీజు చెల్లింపులు భారీ మొత్తంలో నగదు ద్వారా జరుగుతున్నాయని ఆదాయం పన్ను విభాగం గుర్తించింది. భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినప్పుడు నిబంధనలను అనుసరించడం లేదని నిర్ధారణకు వచ్చింది. రూ.2 లక్షల పై చిలుకు నగదు చెల్లింపులు జరిగితే సంబంధిత సంస్థ ఆర్థిక లావాదేవీల ప్రకటన (ఎస్టీఎఫ్)లో తప్పనిసరిగా ఆ వివరాలు నమోదు చేయాల్సి ఉందని ఐటీ శాఖ సీనియర్ అధికారులు పీటీఐకి చెప్పారు. భారీ విలువతో కూడిన వినియోగ ఖర్చు చేసిన టాక్స్ పేయర్ ను గుర్తించాల్సి ఉందని ఆదాయం పన్ను విభాగానికి సీబీడీటీ సూచించింది. నిర్దిష్ట లావాదేవీలకు ఆదాయం పన్ను చట్టంలోని 139ఏ సెక్షన్ ప్రకారం ‘పాన్ కార్డు’ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఎగవేత విషయమై 1100 ప్రాంతాల్లో తనిఖీల్లో రూ.2,500 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశామని, వాటిలో రూ.1700 కోట్ల నగదు ఉందని ఐటీ విభాగం తెలిపింది. డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్ ద్వారా పన్ను ఎగవేతకు చెక్ పెట్టాలని ఐటీ అధికారులకు సీబీడీటీ ఆదేశాలు జారీ చేసింది. భారీ మొత్తంలో పన్ను చెల్లింపుదారులను గుర్తించాల్సి ఉందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
Redmi A3x | రెడ్ మీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఏ3ఎక్స్.. ధరెంతంటే..?!
Jeep India Discounts | ఆ రెండు కార్లపై జీప్ ఇండియా డిస్కౌంట్.. గరిష్టంగా ఎంతంటే..?!
Kia India | కియా ఇండియా నుంచి రెండు ప్రీమియం కార్లు.. అక్టోబర్ 3న లాంచింగ్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

