ChatGPT | సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అర్ధం చేసుకోవడంలో చాట్‌జీపీటీ విఫలం
గత ఏడాది నవంబర్‌లో ఏఐ జనరేటివ్ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) లాంఛ్ అయిన తర్వాత ఈ చాట్‌బాట్‌కు విశేష ప్రాచుర్యం లభించింది.
న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్‌లో ఏఐ జనరేటివ్ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) లాంఛ్ అయిన తర్వాత ఈ చాట్‌బాట్‌కు విశేష ప్రాచుర్యం లభించింది. చాట్‌జీపీటీ టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్‌గా మారడంతో పలు దిగ్గజ సంస్ధలు ఏఐ టూల్స్‌ను లాంఛ్ చేయగా మరికొన్ని కంపెనీలు ఏఐ టూల్స్‌పై కసరత్తు సాగిస్తున్నాయి. చాట్‌జీపీటీతో పలు ఉద్యోగాలు రీప్లేస్ అవుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది. అయితే ఈ చాట్‌జీపీటీ కచ్చితత్వంపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ఈ చాట్‌బాట్ తడబడింది. ఈ విభాగంలో 52 శాతం ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడంలో చాట్‌జీపీటీ విఫలమైందని అమెరికాకు చెందిన పర్డ్యూ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనం స్పష్టం చేసింది. స్టాక్ ఓవర్‌ఫ్లో (ఎస్ఓ)కు సంబంధించి 517 ప్రశ్నలు సంధించగా వీటిలో ఏకంగా 52 శాతం సమాధానాలు సరైనవి కాదని పరిశోధకులు గుర్తించారు. ప్రశ్నల వెనుక ఉన్న కాన్సెప్ట్‌ను ఏఐ చాట్‌బాట్ అర్ధం చేసుకోవడంలో విఫలమైనందునే సరైన సమాధానాలను ఏఐ టూల్ రాబట్టలేకపోయిందని పరిశోధకుల బృందం పసిగట్టింది.
ఏఐ టూల్ పరిమిత రీజనింగ్ సామర్ధ్యాలపైనా ఈ బృందం ప్రశ్నలు లేవనెత్తింది. మరోవైపు చాట్‌జీపీటీ యూజర్ల సంఖ్య తగ్గుముఖం పడుతున్నదని అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ఇటీవల వెల్లడించింది. జూన్, జులై మాసాల్లో చాట్‌జీపీటీ యూజర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. చాట్‌జీపీటీ క్రియేటర్ ఓపెన్ఏఐ ఇంకా లాభాల బాట పట్టలేదని ఈ రిపోర్ట్ పేర్కొంది. కంపెనీ నష్టాలు పెరిగిపోవడం, ఇన్వెస్టర్ల జేబు నుంచి నిర్వహణ ఖర్చులు రావడం గగనంగా మారే పరిస్ధితి కనిపిస్తోందని తెలిపింది. చాట్‌జీపీటీ లాభాల బాట పట్టకపోతే ప్రమోటింగ్ కంపెనీ ఓపెన్ఏఐ దివాళా దిశగా పయనిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Read More :
Zuckerberg Vs Musk | జుక్-మస్క్‌ల కేజ్‌ఫైట్ ముగిసినట్లేనా.. జుకర్‌బర్గ్ ఏమన్నాడంటే
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

