Zuckerberg Vs Musk | జుక్-మస్క్‌ల కేజ్‌ఫైట్ ముగిసినట్లేనా.. జుకర్‌బర్గ్ ఏమన్నాడంటే
Zuckerberg Vs Musk | మెటా (ఫేస్బుక్) అధినేత మార్క్ జుకర్‌బర్గ్, ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్‌లు మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉప్పు నిప్పుగా ఉండే ఈ దిగ్గజ సీఈవోలు కొంతకాలంగా సవాళ్లు, ప్రతిసవాళ్లతో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు.
Zuckerberg Vs Musk | మెటా (ఫేస్బుక్) అధినేత మార్క్ జుకర్‌బర్గ్, ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్‌ల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉప్పు నిప్పుగా ఉండే ఈ దిగ్గజ సీఈవోలు కొంతకాలంగా సవాళ్లు, ప్రతిసవాళ్లతో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. ఇక కొద్దిరోజుల క్రితం జుకర్‌ను కేజ్‌ఫైట్‌కు రావాలని మస్క్ పిలవగా.. ఎక్కడ తలపడుదామో చెప్పు అంటూ జుకర్ కూడా అంతే స్థాయిలో సవాల్ విసిరారు. అయితే ‘జుక్-మస్క్ కేజ్‌ఫైట్ (Cage Fight) ఎక్స్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుందంటూ మస్క్ గత ఆదివారం ప్రకటించారు. తాజాగా ఈ ప్రకటనపై మార్క్ జుకర్‌బర్గ్ థ్రేడ్స్లో స్పందించాడు.
కేజ్ఫైట్పై జుకర్‌బర్గ్ స్పందిస్తూ.. ఎలాన్ మస్క్ ఈ విషయం (కేజ్‌ఫైట్)లో సీరియస్‌గా లేడని మనమంతా ఒప్పుకొని ముందుకు సాగాలి. నేను ఒక డేట్ ఇచ్చి.. డాన వైట్ చారిటీ(Dana White Charity)కి కాంపిటీషన్ ఇస్తాన్నన్నా కూడా అతను డేట్ కన్ఫర్మ్ చేయలేదు. ఒకసారి సర్జరీ ఉంది అంటాడు. ఇప్పుడేమో పెరట్లో ప్రాక్టీస్ చేసుకోండి అన్నాడు. ఒకవేళ ఎలాన్ కేజ్‌ఫైట్ సీరియస్ అయ్యి.. డేట్ ఫిక్స్ అయితే నిజాయితీగా అఫీషియల్ ఈవెంట్ కోసం నన్ను ఎలా కాంటాక్ట్ చేయాలో తనకి తెలుసు. తనకి ఆ ఉద్దేశం లేకపోతే ఈ విషయం పక్కన పెట్టేయడమే మిగిలింది. నేను ఆటను సీరియస్‌గా తీసుకునే వాళ్ళ మీద ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను. అంటూ మెటా థ్రేడ్స్లో రాసుకోచ్చారు.
Post by @zuckView on Threads
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

