ChatGPT | యూజర్లకు చాట్‌జీపీటీ గుడ్ న్యూస్.. అదేమిటంటే..!
ChatGPT | ఇక నుంచి చాట్ జీపీటీ తన యూజర్లందరికీ రియల్ టైం సమాచారం అందజేస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది.
ChatGPT | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్‌బోట్.. చాట్‌జీపీటీ (ChatGPT) తన యూజర్లకు మరో తీపి కబురు అందించింది. ఇక నుంచి రియల్ టైం సమాచారం అందజేస్తామని వెల్లడించింది. ఏదైనా కొత్త సమాచారం అడిగితే ఇంటర్నెట్లో శోధించి మరీ రియల్ టైం సమాచారం అందజేయనున్నది చాట్‌జీపీటీ. ఈ సమాచారం ఇప్పటి వరకూ చాట్‌జీపీటీ ప్లస్, చాట్‌జీపీటీ ఎంటర్ప్రైజెస్ యూజర్లకు మాత్రమే అందించిన ఓపెన్ ఏఐ.. ఇక నుంచి నాన్ సబ్స్క్రైబర్లకు ఈ ఫెసిలిటీ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ నాన్ సబ్స్క్రైబర్లకు 2021 సెప్టెంబర్ నాటి సమాచారం మాత్రమే అందజేసింది ఓపెన్ ఏఐ.
గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ బింగ్ తదితర ఏఐ ఆధారిత చాట్‌బోట్ ప్లాట్‌ఫామ్స్ తమ యూజర్లకు రియల్ టైం సమాచారమే అందిస్తున్నాయి. దీంతో ఓపెన్ ఏఐ సైతం నాన్ సబ్స్క్రైబర్లకు రియల్ టైం సమాచారం అందజేయనున్నది. అయితే, కొన్ని సందర్భాల్లో ఏఐ ఆధారిత చాట్బోట్ల నుంచి తప్పుడు సమాచారం వస్తున్నదని నిపుణులు అంటున్నారు. ఇక ఇప్పటి వరకూ యూజర్లు అడిగే ప్రశ్నలకు టెక్ట్స్ రూపంలో జవాబులిచ్చింది చాట్‌జీపీటీ చాట్‌బోట్. కానీ వాయిస్, ఫొటో క్యాపబిలిటీ తేవడంతో యూజర్లు చాట్‌జీపీటీతో చాటింగ్ కూడా చేయొచ్చు. తమకు అవసరమైన ఫొటో అప్లోడ్ చేసి సలహా అడిగినా జవాబు వస్తుంది. ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్ ఫోన్లు, ఆపిల్ ఐఫోన్లతోపాటు అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో వాయిస్ ఫీచర్ అందుబాటులోకి తెస్తామని ఓపెన్ ఏఐ తెలిపింది.
ChatGPT can now browse the internet to provide you with current and authoritative information, complete with direct links to sources. It is no longer limited to data before September 2021. pic.twitter.com/pyj8a9HWkB
— OpenAI (@OpenAI) September 27, 2023
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

