న్యూఢిల్లీ, జూన్ 24: నెలసరి పన్ను చెల్లింపుల ఫారం జీఎస్టీఆర్-3బీలో మార్పులు చేసే ప్రతిపాదనను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి పరిశీలించే అవకాశాలున్నాయి. వచ్చేవారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం ఉండే వీలున్నది.
సేల్స్ రిటర్న్, నాన్-ఎడిటబుల్ ట్యాక్స్ పేమెంట్ టేబుల్ నుంచి ఔట్వర్డ్ సైప్లెస్ ఆటో-పాపులేషన్ వరకు సవరణలు జరగవచ్చని అధికారులు చెప్తున్నారు. దీనివల్ల నకిలీ బిల్లులకు అడ్డుకట్ట పడవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
అతిథి యాంకర్లకు చెల్లించే గౌరవ వేతనంపై జీఎస్టీ వర్తింపు, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ) లేదా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్)కు పన్ను మినహాయింపులపై జీఎస్టీ శాఖ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం, రాష్ర్టాలకు చెందిన పన్ను అధికారులతో ఏర్పాటైన ఫిట్మెంట్ కమిటీ ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్‌కు ఇప్పటికే వివరించిన నేపథ్యంలో ఈ అంచనాలున్నాయి.