Air India Reshuffle | ఎయిరిండియాలో సమూల మార్పులు.. ఏం చేశారంటే?!
Air India Reshuffle | ఇటీవలే కేంద్రం నుంచి టేకోవర్ చేసుకున్న ఎయిరిండియాలో సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్ సమూల మార్పులు చేశారు.
Air India Reshuffle | ఎయిరిండియా టాప్ మేనేజ్మెంట్లో సంస్థ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ సమూల మార్పులు చేశారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను టాటా సన్స్ టేకోవర్ చేసుకున్న సంగతి తెలిసిందే. చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా టాటా సన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న నిపున్ అగర్వాల్, చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్‌గా టాటా స్టీల్‌లో 2012-21 మధ్య పని చేసిన సురేశ్దత్ త్రిపాఠిని నియమించారు. ఎయిరిండియా-టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటి వరకు ఎయిరిండియాలో పని చేసిన ప్రముఖులు మీనాక్షి మాలిక్, అమృత శరణ్‌లను ఎయిరిండియా సీఈవోకు అడ్వైజర్లుగా నియమించారు. ఇంకా ఎయిరిండియాకు సీఈవోను నియమించలేదు. అప్పటి వరకు మీనాక్షి మాలిక్, అమృత శరణ్.. చంద్రశేఖరన్‌కు అడ్వైజర్లుగా పని చేస్తారు.
ఇక ఇప్పటివరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో పని చేసిన సత్య రామస్వామిని ఎయిరిండియా చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమించారు. ఎయిరిండియా కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ అండ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ అధిపతిగా రాజేశ్ దోగ్రా నియమితులయ్యారు. ఎయిరిండియా వెటరన్ ఆర్ ఎస్ సంధు ఇక ముందు సంస్థ ఆపరేషన్స్ చీఫ్‌గా.. వినోద్ హెజ్మాదీని సంస్థ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా నియమించారు.
ప్రస్తుతం నియమితులైన ఎయిరిండియా కొత్త అధికారులు సంస్థ ప్రతినిధి బృందంగా కూడా వ్యవహరించాలి. కొత్త బాధ్యతల్లో మెరుగైన సేవలందించాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రశేఖరన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. గతేడాది సాగిన వేలం ప్రక్రియలో 2021 అక్టోబర్ 8న ఎయిరిండియాను టాటా సన్స్ అనుబంధ టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేంద్రం రూ.18 వేల కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

