హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) సీఈవోగా పూర్తిస్థాయి బాధ్యతలతో పాటు ఎక్స్-అఫీషియో డైరెక్టర్‌గా విష్ణువర్ధన్‌రెడ్డి నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ (ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, ఎక్స్టర్నల్ ఎఫైర్స్ విభాగం) ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డిని నియమిస్తూ కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీ కుముదిని బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు విష్ణువర్ధన్‌రెడ్డి టామ్‌కామ్ సీఈవోగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతుండగా, ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు.