ట్విట్టర్లో ప్రకంపనలు.. ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లకు సీఈవో ఉద్వాసన!
Twitter Shakes | ట్విట్టర్ ఎలన్‌మస్క్ కాకముందే సంస్థలో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను వైదొలగాలని సీఈవో పరాగ్ అగర్వాల్ అన్నారు.
ట్విట్టర్‌ను టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ టేకోవర్ చేయకముందే మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ట్విట్టర్లో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను వైదొలగాలని ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఆదేశించారు. వారిలో కన్జూమర్ ప్రొడక్టు మేనేజర్ కవ్యోన్ బెయ్క్‌పూర్, రెవెన్యూ జనరల్ మేనేజర్ బ్రూస్ ఫాల్క్ చెప్పారు.
ట్విట్టర్లో చేరిన ఏడేండ్ల తర్వాత వైదొలుగుతున్నట్లు బెయ్క్‌పూర్ ప్రకటించారు. ట్విట్టర్‌ను ఎలన్‌మస్క్ టేకోవర్ చేయడానికి ముందు సంస్థను విభిన్న మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన టీమ్ సిద్ధం చేసుకునేందుకు వైదొలగాలని బెయ్క్పూర్ను పరాగ్ అగర్వాల్ కోరారు.
ట్విట్టర్ నుంచి వైదొలగడం తప్పదని తాను ఊహించానని బెయ్క్‌పూర్ ట్వీట్ చేశారు. పరాగ్ అగర్వాల్ తనను వైదొలగాలని ఆదేశించాడన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ట్విట్టర్ కో-ఫౌండర్ జాక్డోర్సీకి ధన్యవాదాలు తెలిపారు. బ్రూస్ ఫాల్క్ ఐదేండ్లుగా ట్విట్టర్లో పని చేస్తున్నారు. ట్వీట్ ద్వారా తన నిష్క్రమణ సంగతి ప్రకటించారు.
బెయ్క్‌పూర్, బ్రూస్ ఫాల్క్ స్థానంలో జాయ్ సులివన్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన వార్తా కథనం ప్రకారం బెయ్పూర్, బ్రూస్ ఫాల్క్‌లను వైదొలగాలని ఈ-మెయిల్లో పరాగ్ అగర్వాల్ ఆదేశించారు. సంస్థలో నియామకాలు చేపట్టొద్దని, ఖర్చు నిలువరించాలని పేర్కొన్నారు. ఇప్పటికైతే లేఆఫ్‌లు ఉండబోవని క్లారిటీ ఇచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

