హైదరాబాద్, మార్చి 20: ఫ్రెంచ్కు చెందిన దుస్తుల విక్రయ సంస్థ సెలియో.. దేశంలో అతిపెద్ద రిటైల్ అవుట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్‌లో ప్రీమియం ఫ్రెంచ్ ఫ్యాషన్‌కు సంబంధించిన అన్ని రకాల దుస్తులు లభించనున్నాయి. దీంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఏడో అవుట్లెట్ ఇది కావడం విశేషం.