SBI Cash Back Card | ఎస్బీఐ క్యాష్‌బ్యాక్ కార్డు.. అన్ని ఆన్లైన్ లావాదేవీలపై 5% క్యాష్‌బ్యాక్
SBI Cash Back Card | పండుగలతో సంబంధం లేకుండా ఎస్బీఐ క్యాష్‌బ్యాక్ కార్డుతో ఆన్లైన్ లావాదేవీలపై 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది.
SBI Cash Back Card | ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్సే.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ఆన్లైన్ షాపింగ్.. అందునా పండుగల వేళ ఆన్లైన్ షాపింగ్ అంటే డిస్కౌంట్ల వరద పారుతూ ఉంటుంది. కూపన్ కోడ్స్, స్పెషల్ డీల్స్ ద్వారా, క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా డిస్కౌంట్లు పొందొచ్చు. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డుతో ప్రతి ఆన్ లైన్ లావాదేవీ పైనా ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. మర్చంట్స్ పరిమితుల్లేకుండా అన్ని రకాల లావాదేవీలపైనా ఒకశాతం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్పైన ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. కాకపోతే నెలలో రూ.10 వేల లోపు లావాదేవీ పరిమితి మాత్రం ఉంటుంది.
భారత్‌లో ఎక్కడ నుంచైనా.. మెట్రో పాలిటన్ సిటీ.. చిన్న టౌన్ నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నిర్వహించినా అదే మొత్తం క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. ట్రాన్సాక్షన్‌పై స్టేట్మెంట్ వచ్చిన రెండు రోజుల్లో ఎస్బీఐ కార్డు అకౌంట్లో ఆటోమేటిక్‌గా సదరు క్యాష్‌బ్యాక్ ఆఫర్ క్రెడిట్ అవుతుంది.
ప్రతి యేటా (మూడు నెలలకోసారి) దేశీయ విమానాశ్రయాల లాంజ్‌లను ఉచితంగా సందర్శించొచ్చు. రూ.500 నుంచి రూ.3000 మధ్య ఫ్యూయల్ లావాదేవీపై ఒకశాతం ఫ్యూయల్ (గరిష్ఠంగా ప్రతి నెలా రూ.100) సర్ చార్జీ మాఫీ అవుతుంది. వీసాతో కనెక్ట్ అయిన ఎస్బీఐ క్యాష్‌బ్యాక్ కార్డుపై వార్షిక ఫీజు రూ.999 ప్లస్ ఇతర పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఏడాదిలో రూ.2లక్షల లావాదేవీలు జరిపినా.. వార్షిక ఫీజు సంబంధిత వ్యక్తి ఎస్బీఐ కార్డ్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది.
ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డు వచ్చే మార్చి వరకు ఉచితంగా పొందొచ్చు. డిజిటల్ అప్లికేషన్ ప్లాట్‌ఫామ్‌పై మీ పాన్, ఆధార్ వివరాలు, ఫొటోగ్రాఫ్, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పిస్తే చాలు మీరు ఎస్బీఐ క్యాష్‌బ్యాక్ కార్డు పొందొచ్చు.
ఎస్బీఐ డెబిట్/క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కింద ఫెస్టివల్ ఆఫర్లు ప్రారంభం అయ్యాయి. అమెజాన్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో వినియోగదారులకు లభించే డిస్కౌంట్లు పెరుగుతాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

