Indian Banking | బ్యాంకుల్లో నగదు కొరత పెరుగుతోంది..! రుణాలతో పోలిస్తే తగ్గుతున్న డిపాజిట్లు..!
Indian Banking | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండుసార్లు వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించింది. ఆ తర్వాత నుంచి బ్యాంకులు డిపాజిట్ రంగంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2024-25 బ్యాంకుల ఆర్థిక ఫలితాల ప్రకారం.. రుణాలతో పోలిస్తే డిపాజిట్లు బాగా తగ్గుముఖం పట్టాయి.
Indian Banking | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండుసార్లు వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించింది. ఆ తర్వాత నుంచి బ్యాంకులు డిపాజిట్ రంగంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2024-25 బ్యాంకుల ఆర్థిక ఫలితాల ప్రకారం.. రుణాలతో పోలిస్తే డిపాజిట్లు బాగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం బ్యాంకుల వద్ద పుష్కలంగా నగదు ఉన్నది. కాబట్టి ఈ కొరతతో ఎలాంటి సమస్య లేదు. కానీ, భవిష్యత్తులో బ్యాంకులు నగదు కొరతను ఎదుర్కొనే అవకాశం ఉన్నది.
డిపాజిట్లు, రుణాల మధ్య అంతరం చాలా కాలంగా రూ.45-50 లక్షల కోట్ల వద్ద స్థిరంగా ఉందని ఆర్బీఐ డేటా పేర్కొంటున్నది. ఏప్రిల్ 18తో ముగిసిన పక్షం రోజుల్లో డిపాజిట్లు మొత్తం డిపాజిట్లు రూ.228.60 లక్షల కోట్లు కాగా.. రుణాలు రూ.181.86 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ 4న ఇది వరుసగా డిపాజిట్లు రూ.231.14 లక్షల కోట్లు ఉండగా.. రుణాలు రూ.184 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మార్చి 21తో ముగిసిన పక్షం రోజుల్లో డిపాజిట్లు రూ.225.74 లక్షల కోట్లు ఉండగా.. రుణాలు రూ.182.43 లక్షల కోట్లుగా ఉన్నాయి.
జనవరి 24తో ముగిసిన పక్షం రోజుల్లో డిపాజిట్లు 221.28 లక్షల కోట్లు కాగా.. రుణాలు 178.74 లక్షల కోట్లుగా ఉన్నాయి. జనవరి 10 నాటికి డిపాజిట్లు 221.50 లక్షల కోట్లు ఉండగా.. రుణాలు 178 లక్షల కోట్లుగా ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 27తో ముగిసిన పక్షం రోజుల్లో డిపాజిట్లు 220.63 లక్షల కోట్లు కాగా.. రుణాలు 177.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక డిసెంబర్ నుంచి ఆర్బీఐ బ్యాంకుల్లో 8.57 లక్షల కోట్లు అందుబాటులో ఉంచింది.
ఇక బ్యాంకుల వారీగా రుణాల పెరుగుదల, డిపాజిట్లను పరిశీలిస్తే.. ఎస్బీఐలో డిపాజిట్లు 9.47శాతం.. రుణాలు 12.03శాతం పెరిగాయి. కెనరా బ్యాంకులో డిపాజిట్లు 11శాతం.. రుణాలు 11.74శాతంగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్లు 10.30శాతం, రుణాలు 12.80శాతం.. యూకో బ్యాంక్‌లో రుణాలు 11.56శాతం, రుణాలు 17.72శాతం.. ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్‌లో డిపాజిట్లు 9.11శాతం, రుణాలు 14.15శాతంగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రుణాలు 13.44శాతం, రుణాలు 17.76శాతం, ఇండియన్ బ్యాంక్‌లో డిపాజిట్లు 7శాతం, రుణాలు 10శాతం, సెంట్రల్ బ్యాంక్‌లో డిపాజిట్లు 7.19శాతం, రుణాలు 15.24శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10.56శాతం, రుణాలు 13.74శాతంగా ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

