న్యూఢిల్లీ, అక్టోబర్ 20: కెనరా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.2,525 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,333 కోట్ల లాభంతో పోలిస్తే 89 శాతం ఎగబాకింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.21,331.49 కోట్ల నుంచి రూ.24,932.19 కోట్లకు చేరుకున్నది.
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 8.42 శాతం నుంచి 6.37 శాతానికి, నికర ఎన్పీఏ 3.22 శాతం నుంచి 2.19 శాతానికి తగ్గాయి.
మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.2,745.03 కోట్ల నిధులను వెచ్చించింది.
బ్యాంక్ డిపాజిట్లు 7.77 శాతం పెరిగి రూ.1,05,65,19 కోట్లకు చేరుకున్నాయి.
గత దశాబ్ద కాలంలో ఇదే అత్యత్తుమ ఆర్థిక ఫలితాలు. వచ్చే మార్చి నాటికి నిరర్థక ఆస్తుల విలువను 2 శాతం లోపు తగ్గించాలనుకుంటున్నాం.
– ఎల్వీ ప్రభాకర్, కెనరా బ్యాంక్ ఎండీ