హైదరాబాద్, అక్టోబర్ 9: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా భావేంద్ర కుమార్ నియమితులయ్యా రు. 1997లో బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కేరియర్‌ను ప్రారంభించిన కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈడీగా పదోన్నతి పొందారు. 2020లో జనరల్ మేనేజర్‌గా విధులు చేపట్టారు. ఆ తర్వాత 2022లో బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ పొందారు.