ఉక్కుకు ఊతం

- రూ.6,322 కోట్ల పీఎల్ఐ స్కీమ్కు కేంద్ర కేబినెట్ అనుమతి
న్యూఢిల్లీ, జూలై 22:దేశంలో స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తిని పెంచేదిశగా రూ. 6,322 కోట్ల ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉక్కు రంగానికి ఊతమిస్తూ ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సింటివ్ (పీఎల్ఐ) స్కీముకు గురువారం ప్రధాని నరేంద్ర మోది అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ రూ. 6,322 కోట్ల విలువైన ప్రోత్సాహకాల్ని ఐదేళ్లపాటు అందిస్తామని ఠాకూర్ వివరించారు. ఈ స్కీము కారణంగా దేశంలో స్పెషాలిటీ ఉక్కు ఉత్పత్తి పెరగడంతో పాటు దిగుమతులు తగ్గుతాయని ఆయన తెలిపారు. 2023-24 నుంచి 2027-28 వరకూ అమలయ్యే ఈ పీఎల్ఐ స్కీము రూ.40,000 కోట్ల అదనపు పెట్టుబడుల్ని ఆకర్షిస్తుందని, 2.5 కోట్ల టన్నుల ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని ఉక్కు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఈ స్కీము కింద స్పెషాలిటీ గ్రేడ్ స్టీల్ తయారీ కంపెనీలు&అవి పెంచిన ఉత్పత్తి విలువలో 4 నుంచి 12 శాతం వరకూ ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తుంది.
ఏయే స్టీల్ ఉత్పత్తులకు లబ్ది..
పీఎల్ఐ స్కీము ద్వారా కవర్కోటెడ్/ప్లేటెట్ స్టీల్, హైస్ట్రెంత్/వేర్ రెసిస్టెంట్ స్టీల్, స్పెషాలిటీ రెయిల్స్, అల్లాయ్ స్టీల్ ఉత్పత్తులు, స్టీల్ వైర్లు, ఎలక్ట్రికల్ స్టీల్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు లభిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

