CII On Budget 2022 | ఉపాధి పెంపు.. గ్రామీణులకు రిలీఫ్‌కు ఏం చేయాలంటే..?
CII On Budget 2022 | కరోనా నుంచి ఎకానమీ రికవరీ.. ఉపాధి కోసం లెదర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఇన్సెంటివ్లివ్వాలని సీఐఐ కోరింది.

CII On Budget 2022 | ఉత్పాదక రంగంలో ఉద్యోగాలను కల్పించడానికి మరిన్ని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లు అమల్లోకి తేవాలని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) కోరింది. లెదర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి, ఆయా రంగాల్లో ఉద్యోగాలు కల్పించడానికి ఇన్సెంటివ్ స్కీమ్ కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కోరారు.
కరోనా మహమ్మారి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కొత్త ఉద్యోగాల కల్పనకు, ఉద్యోగాలివ్వడానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఉద్యోగాల కల్పనకు ఇన్సెంటివ్‌లు ఇస్తుందని భావిస్తున్నట్లు సీఐఐ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మహమ్మారితో దెబ్బ తిన్న కార్మికులకు రిలీఫ్ కల్పించడానికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద నిధుల కేటాయింపులు పెంచాలని సీఐఐ అభ్యర్థించింది.
ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచడం వల్ల గ్రామీణ పేదలుకు మద్దతుగా నిలబడటంతోపాటు వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని సీఐఐ తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) లో అప్రెంటిస్‌ల నియామక భారం తగ్గించడానికి రియల్‌టైం ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నిర్మించాలని సీఐఐ సూచించింది. దీనివల్ల పని కోసం వేచి ఉన్న కార్మికులు, వర్కర్ల కోసం ఎదురుచూస్తున్న ఎంఎస్ఎంఈల మధ్య సమాచార లోపాన్ని నివారించొచ్చునని వ్యాఖ్యానించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

