హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సరికొత్త ఆలోచనతో స్టార్టప్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అయితే మీ ఆలోచన స్టార్టప్‌గా మారేందుకు అవకాశం ఉందా? స్టార్టప్ నిపుణులతో మీ ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ-సీఐఈ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లో నిర్వహిస్తున్న బూట్ క్యాంప్‌లో మీ స్టార్టప్ ఆలోచనను పరీక్షించుకోండి. ఈనెల 16-17 తేదీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ప్రత్యేకంగా పాల్గొని, విలువైన సలహాలు,సూచనలు ఇవ్వనున్నారు. ఇందులో ఐడియా వాల్యుయేషన్, మార్కెట్లో అవసరం ఉందా, సమస్యలు, రెవెన్యూ మోడల్, యూఎస్పీల నుంచి పోటీ ఏమైనా ఉందా, కస్టమర్ సెగ్మెంట్, గో టు మార్కెట్, వాల్యూ ప్రపోజిషన్… ఇలా రకరకాల అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను తెలియచేయనున్నారు. కొత్తగా స్టార్టప్‌లను ప్రారంభించాలన్న ఆసక్తి ఉండి, మంచి ఆలోచన కలిగిన వారు ఈ బ్యూట్ క్యాంప్‌కు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.