Cash Back on Cylinder Booking | ఎల్పీజీ సిలిండర్ బుకింగ్.. 10% క్యాష్‌బ్యాక్ ఆఫర్.. ఎలాగంటే?!
Cash Back on Cylinder Booking |పాకెట్స్ యాప్‌తో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే, ఐసీఐసీఐ బ్యాంక్ మీకు 10% క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తుంది.

Cash Back on Cylinder Booking | కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంతో కేసులు పెరిగిపోతున్నాయి. దీంతోపాటు వివిధ నిత్యావసర వస్తువులు, సరుకుల ధరలు కూడా బాగానే పెరిగాయి. దీంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజల నిత్యావసర సరుకుల్లో ఒకటైన ఎల్పీజీ సిలిండర్ ధర కూడా బాగానే పెరిగింది. ఈ నేపథ్యంలో ధర తగ్గించుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఓ యాప్ ద్వారా వంట గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఈ అవకాశం ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్నది.
ఉదాహరణకు పాకెట్స్ అనే యాప్ ద్వారా ఏదైనా బిల్లు రూ.200 పే చేశారనుకోండి. దానిపై 10 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్ పొందడం కోసం కస్టమర్లు ఎటువంటి ప్రొమోకోడ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అయితే, ప్రతి నెలలో మూడు బిల్లుల పేమెంట్స్‌కు మాత్రమే పాకెట్స్ యాప్ ఆఫర్ పని చేస్తుంది. ఈ యాప్ కంపెనీ గైడ్‌లైన్స్ ప్రకారం గంట సేపట్లో కేవలం 50 మంది యూజర్లు మాత్రమే అడ్వాంటేజ్ పొందొచ్చు. అయితే ఒక గంటలో ఒక రివార్డు లేదా ఒక క్యాష్ బ్యాక్, ఒక నెలలో మూడు రివార్డులు లేదా మూడు క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందొచ్చు.
పాకెట్స్ యాప్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఇలా
- మీ మొబైల్ ఫోన్లో పాకెట్స్ వాలెట్ యాప్ ఓపెన్ చేసి రీ-చార్జీ చేసుకోవాలి. పే బిల్లు సెక్షన్‌కు వెళ్లాలి.
- పే బిల్స్ ఆప్షన్ టాప్ చేయాలి.
- బిల్లర్స్ సెక్షన్‌ను ఎంపిక చేసి మళ్లీ మోర్ అనే ఆప్షన్‌పై టాప్ చేయాలి.
- ఎల్పీజీ బుకింగ్ ఆప్షన్ కనిపిస్తుంది
- ఇప్పుడు మీరు మీ ఎల్పీజీ సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక చేసుకుని.. మీ మొబైల్ ఫోన్ నంబర్ నమోదు చేయాలి.
- ఇప్పుడు స్క్రీన్‌పై మీ బుకింగ్ అమౌంట్ కనిపిస్తుంది.
- సిలిండర్ బుక్ చేసుకుని.. బుకింగ్ అమౌంట్ పే చేయాలి.
- ఈ ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత మీరు 10 శాతం క్యాష్ బ్యాక్ పొందుతారు. అది మీ పాకెట్స్ వాలెట్లో క్రెడిట్ అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

