బీవోబీ కార్ల రుణాలపై వడ్డీ తగ్గింపు
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కార్ల రుణాలపై వడ్డీరేటును 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కార్ల రుణాలపై వడ్డీరేటును 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో కార్ల రుణాలపై వడ్డీరేటు 7.60 శాతానికి దిగొచ్చింది. సిబిల్ స్కోర్ అధికంగా ఉన్న వారికి మాత్రమే ఈ వడ్డీరేటు వర్తించనున్నదని పేర్కొంది. నూతన కార్ల కొనుగోలుదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది.
అలాగే ఫిక్స్డ్ 8.5 శాతం ప్రారంభంతో వార్షిక వడ్డీరేటును కూడా ఆఫర్ చేస్తున్నది. తగ్గించిన వడ్డీరేటుతోపాటు వ్యక్తిగత రుణగ్రహీతలకు ఫ్లోటింగ్ రేట్ కార్ లోన్లపై ముందస్తు చెల్లింపు లేదా పాక్షిక చెల్లింపులకు ఎలాంటి చార్జీలు ఉండవని బ్యాంక్ పేర్కొంది. రుణాలు తీసుకున్న వ్యక్తులు 84 నెలల వరకు ఎప్పుడైనా తిరిగి చెల్లింపులు జరుపుకొనే అవకాశం కల్పించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

