BMW XM | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారత్ మార్కెట్లోకి తన ఎక్స్ఎం ఎస్యూవీ కారును తీసుకొచ్చింది. కంప్లీట్ లీ బిల్డ్ అప్ యూనిట్ (సీబీయూ)గా భారత రోడ్ల మీదకు వస్తోంది. దీని ధర అక్షరాల రూ.2.60 కోట్లు. బీఎండబ్ల్యూ డీలర్ షిప్ నెట్వర్క్ వద్ద బుకింగ్స్ మొదలయ్యాయి. వచ్చే ఏడాది మే నుంచి డెలివరీ ప్రారంభించనున్నది.
అత్యున్నత పెర్ఫార్మెన్స్ కల తొలి హైబ్రీడ్, ఎలక్ట్రిఫైడ్ డ్రైవ్ సిస్టమ్ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం ఎస్యూవీ కారు సొంతం. న్యూ ‘వీ8’ ఇంజిన్ విత్ ఎం ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీ ప్లస్ 8-స్పీడ్ ఎం స్టెప్ ట్రానిక్ టర్బో టెక్నాలజీ గల ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడిన ఎం-హైబ్రీడ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. 480 కిలోవాట్ల (653 హెచ్‌పీ) గరిష్ట విద్యుత్, 1600-5000 ఆర్పీఎం వద్ద 650 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 100-5500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 280 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
కంబుస్టన్ ఇంజిన్ 360 కిలోవాట్ల (489 హెచ్‌పీ) పవర్ వెలువరిస్తుంది. 25.7 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఉన్న బీఎండబ్ల్యూ ఎక్స్ఎం ఎస్ యూవీ కారు 88 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. కేవలం 4.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఎం – డ్రైవర్ ప్యాకేజీ కింద గంటకు 270 కిలోమీటర్ల దూరం ప్రయాణ ఆప్షన్ కూడా లభిస్తుంది.
రియల్ టైం ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ తోపాటు 14.9 కర్వ్డ్ డిస్ ప్లే విత్ నేవిగేషన్, స్టీరింగ్ వీల్ హెడ్-అప్ డిస్ ప్లే వెనుక 12.3 అంగుళాల డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే ఉంటుంది. ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎం డైనమిక్ మోడ్ (ఎండీఎం), అటెంటివ్ నెస్ అసిస్టెన్స్, ఎం-స్పోర్ట్ డిఫరెన్షియల్ నెట్ వర్క్డ్ విత్ కంట్రోల్ (డీబీసీ), యాక్టివ్ రోల్ స్టేబిలైజేషన్ విత్ యాక్టివ్ రోల్ కంఫర్ట్, పర్ ఫార్మెన్స్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సర్, ఐసోఫిక్ చైల్డ్ సీట్, తదితర ఫీచర్లు ఉన్నాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్ఎం ఎస్ యూవీ కారు ఏడు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. కేప్ యార్క్ గ్రీన్, టోరెంటో రెడ్, మినరల్ వైట్, బీఎండబ్ల్యూ ఇండివిడ్యుయల్ డ్రావిట్ గ్రే, బ్లాక్ సఫైర్, మెరీనా బే బ్లూ, కార్బన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. రెండేండ్ల వారంటీ ఉంది. బ్యాటరీకి 1.20 లక్షల కిలోమీటర్ల వరకు లేదా ఎనిమిదేండ్ల వారంటీ ఇస్తోంది.