BMW EV Sedan i4 | విపణిలోకి ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4.. 5.7 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. ఇంకా!
BMW EV Sedan i4 | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ విపణిలోకి ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4ను ఆవిష్కరించింది.
BMW EV Sedan i4 | భారత్‌లో వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 10 శాతానికి పైగా పెంచుకోవాలని జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ `బీఎండబ్ల్యూ` లక్ష్యంగా పెట్టుకున్నది. ఆల్ ఎలక్ట్రిక్ సెడాన్ ఐ4ను భారత్‌లో ఆవిష్కరించింది. వాహనాల విద్యుద్ధీకరణ వేగవంతం చేస్తామని తెలిపింది. దీని ధర రూ.69.9 లక్షల నుంచి మొదలవుతుంది. వచ్చే ఆరు నెలల్లో మూడు ఎలక్ట్రిక్ కార్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని గతేడాది నవంబర్లోనే బీఎండబ్ల్యూ ప్రకటించింది. ఇంతకుముందు ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఐఎక్స్, ఆల్ ఎలక్ట్రిక్ మినీ ఎస్ఈ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ కార్లను ఆవిష్కరించింది. మేం భారత్ మార్కెట్లో ఐఎక్స్, మినీ ఎస్ఈ (ఎలక్ట్రిక్) కార్లను ఆవిష్కరించాం. సుమారు ఐదు శాతం గిరాకీ ఉంది. ఇది ఆరోగ్యకరంగానే కనిపిస్తున్నది. వచ్చే ఏడాది ఐ4 ఆవిష్కరణతో తమ ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 10 శాతం దాటతాయని అంచనా వేస్తున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈవో విక్రం పవాహ్ తెలిపారు.
మార్చి నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంలో వాహనాల విక్రయంలో 25.3 శాతం వృద్ధితో 2,815 వాహనాలు విక్రయించింది. 2020తో పోలిస్తే 2021లో 34.4 శాతం గ్రోత్తో 8,876 వాహనాలు విక్రయించినట్లు బీఎండబ్ల్యూ వెల్లడించింది. `ఐ4` కారు కేవలం 5.7 సెకన్లలో 100 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 80.7 కిలోవాట్ అవర్స్ ఉంటుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 590 కి.మీ. దూరం ప్రయాణించడం దీని స్పెషాలిటీ.
పూర్తిగా దిగుమతి చేసుకునే `ఐ4` కంప్లీట్లీ బిల్ట్ యూనిట్.. బీఎండబ్ల్యూ గ్రూప్ ఈ-డ్రైవ్ టెక్నాలజీలో ఐదో తరం కారు. ఇది ఎలక్ట్రిక్ మోటార్, సింగిల్ స్పీడ్ ట్రాన్స్మిషన్, పవర్ ఎలక్ట్రానిక్స్ తదితర ఫీచర్లు కలిగి ఉంది. ఆన్లైన్లో బీఎండబ్ల్యూ ఐ4 కారును షాప్ డాట్కాం బీఎండబ్ల్యూ డాట్కాం ఐఎన్ ( shop.bmw.in ) బుక్ చేసుకోవచ్చు. జూలై నుంచి కార్ల డెలివరీ ప్రారంభిస్తారు. బీఎండబ్ల్యూ ఐ4 కారుతోపాటు కాంప్లిమెంటరీగా బీఎండబ్ల్యూ వాల్‌బాక్స్ చార్జర్ ఇన్‌స్టల్ చేస్తారు. ఇంటి వద్ద 11 కిలోవాట్ల వరకు సురక్షితంగా, సౌకర్యవంతంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- All Electric
- BMW
- Sedan i4
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

