BMW 5Series 50 Jahre M | లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గురువారం కొత్త మోడల్ కారు `50 జహ్రే ఎం ఎడిషన్` ఆవిష్కరించినట్లు తెలలిపింది. 5 సిరీస్ ఆధారంగా మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ధర రూ.67.5 లక్షలు పలుకుతున్నది. కేవలం 6.1 సెకన్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుందీ కారు.
5 సిరీస్ 50 జాహ్రీ ఎం మోడల్ కారు చెన్నైలోని బీఎండబ్ల్యూ ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్నది. పెట్రోల్ వేరియంట్ కారు బీఎండబ్ల్యూ 530 ఐఎం స్పోర్ట్ రూపంలో వస్తున్నది. బీఎండబ్ల్యూ 5 సిరీస్ 50 జాహ్రీ ఎం మోడల్ కార్లు పరిమితంగా ఉత్పత్తి చేస్తున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. గురువారం నుంచి ఆన్ లైన్లో బుక్ చేసుకోవచ్చునని తెలిపింది. 2-లీటర్ల పెట్రోల్ సామర్థ్యం, 252 హెచ్పీ సామర్థ్యం గల ఇంజిన్ ఇందులో ఉంది.
రెడ్ ఎం స్పోర్ట్ బ్రేక్ కాలిపిర్స్తోపాటు జెట్ బ్లాక్లో 18 అంగుళాల ఎం అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సలూన్ తోపాటు నాలుగు మెటాలిక్ ఆప్షన్లు.. కార్బన్ బ్లాక్, ఫైటోనిక్ బ్లూ, అల్పైన్ వైట్, బెర్నినా గ్రే అంబర్ రంగుల్లో ఈ కారు లభిస్తుంది.