న్యూఢిల్లీ, జూలై 21: బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్‌కు తెలంగాణలో ఉన్న ప్లాంట్‌పై అమెరికా నియంత్రణ మండలి అభ్యంతరాలు వ్యక్తంచేసింది. హైదరాబాద్‌లో కంపెనీకి ఉన్న ప్లాంట్‌ను ఈ నెల 20న తనిఖీ చేసిన అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ఎఫ్డీఏ) మూడు అభ్యంతరాలు వ్యక్తంచేసినట్లు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ పరిశీలనలపై సరైన సమయంలో స్పందిస్తామని తెలిపింది. ఔషధ ఉత్పత్తిలో నాణ్యత, భద్రత ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నట్లు ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది.