Bill Gates | 100 ఏళ్లైనా.. ఏఐతో ఆ స్థానాలను భర్తీ చేయడం సాధ్యం కాదు : బిల్‌గేట్స్
Bill Gates | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence).. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట.
Bill Gates | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence).. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇప్పుడు ఇది సర్వాంతర్యామి అయిపోయింది. ఎలాంటి ప్రశ్నకైనా ఇట్టే సమాధానం ఇస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ ఏఐ విస్తరించింది.
దీంతో ఏఐ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇది మంచి విషయమే అయినప్పటికీ.. ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించి.. వారి స్థానాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆందోళనల వేళ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 100 ఏళ్లైనా ప్రోగ్రామర్లను (programmers) ఏఐ భర్తీ చేయలేదన్నారు. అంతేకాదు కోడింగ్ పైనా ఏఐ ప్రభావం ఉండదని చెప్పారు.
ఓ ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. ‘కృత్రిమ మేధ అనేది ప్రోగ్రామింగ్ రంగంలో మనిషికి ప్రత్యామ్నాయం కాలేదు. కేవలం ఒక సహాయకారిగా మాత్రమే పనిచేస్తుంది. ప్రోగ్రామింగ్‌లో క్లిష్టమైన సమస్యగా భావించేదాన్ని క్రియేటీవ్‌గా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రోగ్రామింగ్‌లో అది సవాలుతో కూడుకున్న విషయం. మానవ మేధస్సు లేని యంత్రాలు (ఏఐ) అలా చేయలేవు’ అని బిల్‌గేట్స్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా కోడింగ్ అంటే కేవలం టైపింగ్ చేయడం కాదని.. చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుందని బిల్‌గేట్స్ తెలిపారు. ఈ మేరకు భవిష్యత్తులో కోడింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బయాలజీ రంగాలకు ఆటోమేషన్ ముప్పు తక్కువేనని ఆయన అంచనా వేశారు.
Also Read..
Indian student | గాల్లో ఢీ కొన్న శిక్షణ విమానాలు.. కేరళకు చెందిన యువకుడు మృతి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

