Bill Gates | వీకెండ్ సెలవులు.. పనిపై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు.. జీవితమే గొప్పదన్న బిలియనీర్
Bill Gates | పని కంటే జీవితం చాలా గొప్పదని చెప్పారు మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్. ప్రారంభంలో వారాంతపు సెలవులు తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉండేదని, కానీ తండ్రినయ్యాక అభిప్రాయం మారిందన్నారు.
Bill Gates | వారాంతపు సెలవులపై మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సంస్థలో పని చేసే మొదట్లో వారాంతపు సెలవులు తీసుకుని, పని చేయకుండా ఉండటం తనకు నచ్చేది కాదన్నారు. కానీ తండ్రయ్యాకే తన అభిప్రాయం మారిందని బిల్ గేట్స్ స్వయంగా తన బ్లాగ్‌లో రాశారు. పని కంటే జీవితం గొప్పదని, విలువైందని గ్రహించానని పేర్కొన్నారు. తన పిల్లల వయస్సులో తాను ఉన్నప్పుడు సెలవులపై ఆసక్తి ఉండేది కాదన్నారు. తండ్రినయ్యాకే తన అభిప్రాయం మారిందన్నారు. తన పిల్లల ఎదుగుదల తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
పని- జీవితం సమ తుల్యతపై బిల్ గేట్స్ మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం కాదు. ఈ ఏడాది మొదట్లో అరిజోనా విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పనికంటే జీవితం ఎంతో గొప్పదని, కానీ, ఆ సంగతి తెలుసుకోవడానికి చాలా టైం పట్టిందని బిల్ గేట్స్ చెప్పారు. మీరు మీ బంధాలను బల పర్చుకోవడానికి, మీరు సాధించిన విజయాలను షేర్ చేసుకోవడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత టైం వెచ్చించండి` అని విద్యార్థులకు సూచించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

