హైదరాబాద్, డిసెంబర్ 7: బిగ్”సి’.. 20వ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్, స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేసిన వారితో లక్కీ డ్రా నిర్వహించి వారు 20 కార్లు, 20 బైకులు, 20 ఏసీలు, 20 రిఫ్రిజిరేటర్లు, 20 టీవీలు గెలుచుకోవచ్చునని కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి తెలిపారు.
వీటితోపాటు ప్రతి స్మార్ట్‌టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతితో పాటు 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్, సులభ వాయిదాల పద్దతిలో వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా మొబైల్ కొనుగోలు చేయవచ్చునన్నారు. అలాగే మొబైల్ రిటైల్ రంగంలో తొలిసారిగా యాక్ససరీస్ కొనుగోలుపై ఖచ్చిత బహుమతిని కూడా ఇస్తున్నట్లు చెప్పారు.