Big layoffs | మైక్రోసాఫ్ట్ గేమింగ్ డివిజన్లో లేటెస్ట్ లేఆఫ్స్ : 1900 మంది ఉద్యోగులపై వేటు
Big layoffs : కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత కొనసాగుతున్నది. గూగుల్, మెటా, అమెజాన్ సహా పలు టెక్ దిగ్గజాలు తాజా లేఆఫ్స్ ప్రకటిస్తుండటంతో టెకీల్లో గుబులు రేగుతోంది. ఇక మైక్రోసాఫ్ట్ తాజా దశ లేఆఫ్స్‌ను ప్రకటించింది.
Big layoffs : కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత కొనసాగుతున్నది. గూగుల్, మెటా, అమెజాన్ సహా పలు టెక్ దిగ్గజాలు తాజా లేఆఫ్స్ ప్రకటిస్తుండటంతో టెకీల్లో గుబులు రేగుతోంది. ఇక మైక్రోసాఫ్ట్ తాజా దశ లేఆఫ్స్‌ను ప్రకటించింది. యాక్టివిజన్ బ్లిజర్డ్, ఎక్స్‌బాక్స్ సహా గేమింగ్ డివిజన్లో లేటెస్ట్ లేఆఫ్స్‌ను ప్రకటించింది. మైక్రోసాప్ట్ గేమింగ్ డివిజన్లో 8 శాతం ఉద్యోగులు అంటే దాదాపు 1900 మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది.
నూతన ప్రాజెక్టులపై దృష్టి సారించడం, కార్యకలాపాల క్రమబద్ధీకరణతో ఈ సంక్లిష్ట బాధాకర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఈ ప్రక్రియను గేమింగ్ నాయకత్వ బృందంతో పాటు తాను సాఫీగా సాగేలా కృషి చేస్తామని మైక్రోసాఫ్ట్ గేమింగ్ సీఈవో ఫిల్ స్పెన్సర్ ఉద్యోగులకు పంపిన మెయిల్లో పేర్కొన్నారు.
లేఆఫ్స్ ప్రకంపనలు, పునర్వ్యవస్ధీకరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ బ్లిజార్డ్‌లో కీలక స్ధానాల్లో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు తప్పుకున్నారు. బ్లిజార్డ్ ప్రెసిడెంట్ మైక్ బరా, చీఫ్ డిజైన్ ఆఫీసర్ అలెన్ అథమ్ కంపెనీని వీడి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీరి నిష్క్రమణను మైక్రోసాఫ్ట్ గేమ్ కంటెంట్, స్టూడియోస్ ప్రెసిడెంట్ మ్యాట్ బూటీ నిర్ధారించారు. వచ్చేవారం బ్లిజార్డ్ నూతన ప్రెసిడెంట్‌ను నియమిస్తామని తెలిపారు.
Read More :
Wipro-Azim Premji | ఇద్దరు కొడుకులకూ విప్రో ఫౌండర్ అజీం ప్రేమ్ జీ గిఫ్ట్.. అదేమిటంటే..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

