రామచంద్రాపురం, జూలై 27: విద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ భెల్..బంగ్లాదేశ్‌లో 1,320 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరదరాజన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. భెల్ చరిత్రలో ఇదొక మైలురాయి వంటిదని, ఇప్పటికే 660 మెగావాట్ల యూనిట్-1ని విజవంతంగా పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు భారత్-బంగ్లాదేశ్ దేశాల మధ్య సహకారానికి చిహ్నాంగా నిలుస్తున్నదని చెప్పారు. ఈ పవర్ ప్రాజెక్ట్‌ని నిర్ణీత సమయంలోపే పూర్తి చేసి సత్తాచాటిందని పేర్కొన్నారు.