ఈ యాప్స్‌తో జర భద్రం

- 12 మాల్వేర్ అప్లికేషన్లపై నిపుణుల హెచ్చరిక
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: గూగుల్ ప్లే స్టోర్‌లోని 12 మాల్వేర్ ఆండ్రాయిడ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్స్‌లోని అప్లికేషన్లు హానికరమైన మాల్వేర్ కంటెంట్‌ను డివైస్‌లోకి ప్రవేశపెడతాయన్నారు.
క్యూఆర్ స్కానర్, క్యూఆర్ స్కానర్ 2021, పీడీఎఫ్ డాక్యుమెంట్ స్కానర్ ఫ్రీ, పీడీఎఫ్ డాక్యుమెంట్ స్కానర్, టూ ఫ్యాక్టర్ అథంటికేటర్, ప్రొటెక్షన్గార్డ్, క్యూఆర్ క్రియేటర్ స్కానర్, మాస్టర్స్కానర్ లైవ్, క్రిప్టోట్రాకర్, జిమ్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్లను మాల్వేర్ ఆండ్రాయిడ్ యాప్స్‌గా థ్రెట్‌ఫ్యాబ్రిక్ సంస్థ పరిశోధకులు గుర్తించారు. ఈ యాప్స్‌కు 3 లక్షల డౌన్లోడ్స్ ఉన్నాయన్నారు.
యూజర్ల ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను, టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ కోడ్స్‌ను దొంగిలించేలా వీటిని డిజైన్ చేసారని తెలిపారు. ఈ మాల్వేర్ ఫోన్లో యూజర్ చేసే టైపింగ్‌ను తెలుసుకుంటుందని, యూజర్ ఫోన్ల స్క్రీన్‌షాట్స్‌ను తీసుకుంటుందన్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్స్‌కు అనుకూల సమీక్షలు ఉంటాయని, దీంతో అవి ప్రయోజనకరమనే భావన కలిగిస్తాయని నిపుణులు వివరించారు.
గూగుల్ నియంత్రణలు ఉన్నా…
ఇటువంటి హానికారకమైన యాప్స్ ప్లే స్టోర్‌లో ప్రవేశించకుండా, పలు నియంత్రణల్ని గూగుల్ అమలు చేస్తున్నా, గూగుల్ ప్లే స్టోర్ వీటిలో మాల్వేర్ను గుర్తించలేకపోతున్నది. ఎందుకంటే ఇవి చాలా చిన్న మాల్వేర్ ఫుట్‌ప్రింట్‌ను కలిగిఉన్నందున, ఈ యాప్స్‌ను కనుగొనడం కష్టతరమవుతున్నది. మాల్వేర్ను ఇన్స్టాల్ చేయకుండా యూజర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సమర్థవంతమైన యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకుంటే… అది డౌన్లోడ్ చేసుకున్న ప్రతీ కొత్త యాప్‌ను స్కాన్ చేస్తుందని, అనుమానాస్పద యాక్టివిటీని పర్యవేక్షిస్తుందని నిపుణలు చెపుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

