Fixed Diposits | విదేశీ బ్యాంక్‌ల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై బెస్ట్ వడ్డీరేట్లు ఇలా..!
Fixed Diposits | దీర్ఘకాల పెట్టుబడికి సరైన ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్లు. దేశీయ బ్యాంకుల కంటే విదేశీ బ్యాంకులు అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి.
Fixed Diposits | సుదీర్ఘ కాలం పాటు పెట్టుబడికి సరైన మార్గం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)గా పరిగణిస్తారు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు ఆఫర్ చేస్తాయి. సేవింగ్స్ ఖాతాతో పోలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీరేటు లభిస్తుంది. 1997 అక్టోబర్ 22న ఆర్బీఐ వివిధ రకాల టర్మ్ డిపాజిట్ పథకాలకు వడ్డీరేట్లను ఖరారు చేసే స్వేచ్ఛనిచ్చింది. సంబంధిత డైరెక్టర్ల బోర్డు ఆమోదం పొందితే ఆయా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఖరారు చేయొచ్చు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్, సహకార, ప్రాంతీయ బ్యాంకులతోపాటు విదేశీ బ్యాంకులు కూడా సేవలందిస్తున్నాయి. విదేశీ బ్యాంకులు సైతం తమ ఖాతాదారుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 46 విదేశీ బ్యాంకులు పని చేస్తున్నాయి. దేశంలోని ఇతర బ్యాంకులతో పోలిస్తే విదేశీ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు లభిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందామా.. !
స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్
1-2 ఏండ్ల లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు: 5.25 నుంచి 5.30%
3-5 ఏండ్ల లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు : 5.35 నుంచి 5.60 %
సిటీ బ్యాంకు
1-2 ఏండ్లలోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు : 2.75 నుంచి 3%
మూడేండ్లకు పైగా గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు: 3.5%
హెచ్ఎస్బీసీ బ్యాంక్
1-2 ఏండ్లలోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు : 3.10-3.5%
3-5 ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు : 4%
డచెస్ బ్యాంక్ ( DEUTSCHE BANK )
ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు: 3.85 నుంచి 5%
3-5 ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు: 5.50 నుంచి 6%
5 ఏండ్లకు పైగా గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు : 6.25%
డీబీఎస్ బ్యాంక్
1-2 ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు: 5 నుంచి 5.25%
3-5 ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు : 5.65%
5-10 ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు : 5.75%
బార్క్లేస్ బ్యాంక్
1-2 ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు: 3.58-3.85%
3-5 ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు : 4.55-4.98%
7 ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లు : 4.98-5.36%
అయితే, విదేశీ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మీరు క్లయిమ్ చేయకుంటే మాత్రం సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీతో సమానమైన వడ్డీ మాత్రమే వస్తుంది. 5-10 ఏండ్ల మధ్య గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు ప్రస్తుతం 5 శాతానికి పైగా వడ్డీ ఇస్తున్నాయి. సేవింగ్స్ ఖాతాలపై 3-4 శాతం వడ్డీ అందిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

