Best Deposit Schemes | అధిక ధరలను అదుపు చేయడానికి ఒకవైపు ఆర్బీఐ రెపోరేట్.. మరోవైపు బ్యాంకులు వివిధ రుణాలపై కీలక వడ్డీరేట్లు పెంచేస్తున్నాయి. తదనుగుణంగా తమ ఖాతాదారుల డిపాజిట్లపై వడ్డీరేట్లు కూడా సవరిస్తున్నాయి. రుణాలతో పోలిస్తే డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపు కాస్త వెనుకబడింది. అయినా ఆర్బీఐ రెపోరేట్‌కు అనుగుణంగానే భవిష్యత్‌లో వివిధ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్దగా నష్టం భయం లేని ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి స్థిరమైన ఆదాయ మార్గాల్లో పొదుపు చేయడం మంచిదని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
ఖాతాదారులను ఆకర్షించడానికి పలు బ్యాంకులు ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు తెస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. ఎస్బీఐ.. అమృత్ కలశ్ పేరుతో స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తెచ్చింది. ఈ పథకం కింద 400 రోజుల గడువుతో చేసే డిపాజిట్లపై 7.6 శాతం వడ్డీ అందిస్తున్నది. ఇక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వడ్డీరేట్లు కాసింత ఎక్కువ. కానీ, వీటిలో మధ్యలో విత్‌డ్రాయల్స్‌కు చాన్స్ ఉండదు. కనుక ఎమర్జెన్సీగా డబ్బు అవసరాలు వస్తాయేమోనన్న అంశాన్ని ముందే చెక్ చేసుకుని పొదుపు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్ఎస్)లో డిపాజిట్ల పరిమితి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతూ గత నెల ఒకటో తేదీన వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. దీనిపై కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వగానే ఎక్కువ వడ్డీపై ఎస్సీఎస్ఎస్ స్కీమ్‌లో డిపాజిట్ చేయడం మంచిదని చెబుతున్నారు. ఈ పథకంలో డిపాజిట్లపై ప్రస్తుతం 8 శాతం వడ్డీ లభిస్తున్నది. సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు కంటే ఇది 0.50-0.75 శాతం ఎక్కువ.
కాగా, మంత్లీ ఇన్‌కం అకౌంట్లో గరిష్ట డిపాజిట్ పరిమితి రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు, జాయింట్ ఖాతాల పరిమితి రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది.మంత్లీ ఇన్‌కం అకౌంట్ స్కీమ్ మీద ఇప్పుడు 7.1 శాతం వడ్డీ అందిస్తున్నారు. ఇక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ మీద ఏడు శాతం వడ్డీ లభిస్తుంది. బ్యాంకులతోపాటు పోస్టాఫీసు టైం డిపాజిట్లలోనే ఎక్కువగా ఉంది.
మిగులు నిధులను పెట్టుబడిగా పెట్టడానికి సరైన స్కీం లిక్విడ్ ఫండ్స్. దీనిపై కనీసం 6.5శాతం రిటర్న్స్ లభిస్తాయి. ఈ పథకాల్లో 91 మెచ్యూరిటీ పీరియడ్ ఉంటది. కమర్షియల్ పేపర్స్, సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్లు తదితర సెక్యూరిటీస్‌లో నిధులు మదుపు చేయొచ్చు. వీటికి ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ ఉండదు.