లండన్ : కరోనా మహమ్మారి విశ్వవ్యాప్తంగా పని ప్రదేశాలు, పని పరిస్ధితులను సమూలంగా మార్చివేసింది. వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్ వంటి పని పద్ధతులు ముందుకొచ్చాయి. ఉద్యోగులను ఆకట్టుకునేందుకు బ్రిటన్ పబ్‌లు వర్క్ ఫ్రం పబ్ సెటప్‌కు తెరలేపాయి. మారుమూల ప్రదేశాల నుంచి పనిచేసే ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రం పబ్ సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి.
ఇంటర్నెట్ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో డెడ్‌లైన్స్‌ను చేరుకోలేని ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రం పబ్ ఐడియాతో బ్రిటిష్ పబ్‌లు బిజినెస్ పెంచుకునేందుకు సిద్ధమయ్యాయి. వైఫై, చార్జింగ్ స్పాట్, ఫుడ్, డ్రింక్స్ వంటి ఆకర్షణీయ ప్యాకేజ్లతో వర్క్ ఫ్రం పబ్ సెటప్‌ను ఉద్యోగుల ముందుకు తెచ్చాయి. ఫుల్లర్ చైన్‌కు చెందిన 380 పబ్‌లు రోజుకు రూ 900 నుంచి వర్క్ ఫ్రం పబ్ డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
ఈ డీల్‌లో భాగంగా లంచ్, డ్రింక్, వైఫైలను పబ్‌లు సమకూరుస్తాయి. ఇక యంగ్స్కు చెందిన 185 పబ్‌లు రోజుకు రూ 1300 చార్జ్ చేస్తూ వర్క్ ఫ్రం పబ్ సెటప్‌ను ఉద్యోగులకు ఆఫర్ చేస్తున్నాయి. రిలాక్స్డ్ మూడ్‌లో పబ్‌లో పనిచేయవచ్చని, ఎంచక్కా బీరు ఎంజాయ్ చేస్తూ పనిచేయడంతో పాటు పబ్ వర్కర్లతోనూ మంచి అనుబంధం ఏర్పడుతుందని వర్క్ ఫ్రం పబ్ కస్టమర్లు చెబుతున్నారు.