నూతనంగా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఈ వార్త మీకోసమే. ఏయే బ్యాంకుల్లో ఎంత వడ్డీకి కారుపై రుణాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రవాణా చార్జీలు తడిసిమోపెడు అవుతున్న ప్రసుత్త తరుణంలో కుటుంబానికి కారు అత్యవసర వస్తువగా మారిపోయింది. ఈ నూతన సంవత్సరంలో కారుపై ఏయే బ్యాంకుల్లో ఎంత వడ్డీకి రుణాలు ఇస్తున్నారో, ప్రాసెసింగ్ ఫీజు ఎంత వరకు వసూలు చేస్తున్నారు పాలసీబజార్.కామ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ అతి తక్కువ వడ్డీ 8.45 శాతానికి కారుపై రుణాలు మంజూరు చేస్తున్నది. అలాగే పలు బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులను సైతం ఎత్తివేశాయి. వీటిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, ఎస్బీఐ, బీవోఎంలు ఉన్నాయి.