January Bank Holidays | జనవరిలో బ్యాంకులు పని చేసేది 16 రోజులే .. ఇవీ డిటైల్స్..!
January Bank Holidays | చరిత్ర కాల గర్భంలో మరో వసంతం కలిసిపోతున్నది. యావత్ మానవాళి నూతన సంవత్సరం 2024కు స్వాగతం పలుకుతోంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే 2024 జనవరిలో జాతీయ, ప్రాంతీయ సెలవులు కలుపుకుని మొత్తం 16 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
January Bank Holidays | చరిత్ర కాల గర్భంలో మరో వసంతం కలిసిపోతున్నది. యావత్ మానవాళి నూతన సంవత్సరం 2024కు స్వాగతం పలుకుతోంది. కొత్త వసంతంలో ఆర్థికంగా మరింత బల పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, గతంతో పోలిస్తే ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా నిర్వహిస్తుంటారు. దాదాపు అన్ని చెల్లింపులూ డిజిటలైజ్ అయినా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఖాతాదారులు తమ బ్యాంకు శాఖలను సంప్రదించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి క్షణమూ విలువైనదే.. కనుక బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వస్తే ముందుగా బ్యాంకులకు సెలవులు ఎప్పుడో చెక్ చేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంటుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే 2024 జనవరిలో జాతీయ, ప్రాంతీయ సెలవులు కలుపుకుని మొత్తం 16 రోజులు బ్యాంకులకు సెలవులు. రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు, జాతీయ సెలవు దినాలు, పండుగలకు సెలవులు ప్రకటించారు.
జాతీయంగా, ప్రాంతీయంగా జనవరిలో బ్యాంకుల సెలవులు ఇలా
జనవరి 1 (సోమవారం) – నూతన సంవత్సరాది – ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్ టక్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమ, షిల్లాంగ్
జనవరి 2 (మంగళవారం) – నూతన సంవత్సరాది – ఐజ్వాల్
జనవరి 7 (ఆదివారం) – దేశమంతా వారాంతపు సెలవు
జనవరి 11 (గురువారం) -మిషనరీ డే -ఐజ్వాల్
జనవరి 13 (శనివారం) – రెండో శనివారం- జాతీయ సెలవు
జనవరి 14 (ఆదివారం) – జాతీయ సెలవు
జనవరి 15 (సోమవారం) మకర సంక్రాంతి – బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్ టక్, గువాహటి, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్
జనవరి 16 (మంగళవారం) – తిరువల్లూర్ డే – చెన్నై
జనవరి 17 (బుధవారం)- ఉజ్వల్ తిరునాళ్లు, శ్రీ గురు గోవింద్ జింగ్ జయంతి – చండీగఢ్, చెన్నై
జనవరి 21 (ఆదివారం) – వారాంతపు జాతీయ సెలవు
జనవరి 22 (సోమవారం) -ఇమైనొ ఇరట్పా -ఇంఫాల్
జనవరి23 (మంగళవారం) – గాన్-న్ఘాయి – ఇంఫాల్
జనవరి 25 (గురువారం) – థాయి పూసం, మహ్మద్ హజరత్ అలీ – చెన్నై, కాన్పూర్, లక్నో
జనవరి 26 (శుక్రవారం) -గణతంత్ర దినోత్సవం – అగర్తల, డెహ్రాడూన్, కోల్‌కతా మినహా దేశమంతా సెలవు.
జనవరి 27 (శనివారం) – నాలుగో శనివారం – జాతీయ వారాంతపు సెలవు దినం.
జనవరి 28 (ఆదివారం) – జాతీయ వారాంతపు సెలవు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

