Bank Holidays | అక్టోబర్‌లో బ్యాంకులకు 12 రోజులు మూసివేత..! హాలీడేస్ ఆర్బీఐ ఫుల్ లిస్ట్ ఇదే..!
Bank Holidays | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ మాసానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. దాదాపు 12 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా చేసుకోవడం మంచిది.
Bank Holidays | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ మాసానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. దాదాపు 12 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులుపడే ఛాన్స్ ఉంటుంది. అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్, ధన్‌తేరాస్, దీపావళి పండుగల సందర్భంగా సెలవులు రానున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, శనివారాలు.. ఆదివారాల్లో కలిపి 12 రోజులు బ్యాంకులకు సెలవులు పడనున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా సెలవుల్లో మార్పులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో పండుగలకు సెలవులు ఉంటాయి. అలాగే, రెండు, నాల్గో శనివారాలతో పాటు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడే విషయం తెలిసిందే. అయితే, ఇంతకీ బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయో ఓ లుక్కేద్దాం రండి..!
సెలవులు జాబితా
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బ్యాకులకు సెలవు.
అక్టోబర్ 3న నవరాత్రి వేడుకలు ప్రారంభం. మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 6న ఆదివారం బ్యాంకుల మూసివేత.
అక్టోబర్ 10 మహా సప్తమి సందర్భంగా బ్యాంకులకు హాలీడే.
అక్టోబర్ 11న మహానవమి సందర్భంగా మూసివేత.
అక్టోబర్ 12న దసరా, రెండో శనివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత.
అక్టోబర్ 13న ఆదివారం కావడంతో సెలవు.
అక్టోబర్ 17న కటి బిహు (అసోం), వాల్మీకి జయంతి కారణంగా బ్యాంకులకు హాలీడే.
అక్టోబర్ 20న ఆదివారం సెలవు.
అక్టోబర్ 26న విలీన దినోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీర్లో, నాల్గో శనివారం కారణంగా హాలీడే.
అక్టోబర్ 27న ఆదివారం సెలవు.
అక్టోబర్ 31న దీపావళి, సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్భంగా సెలవు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

