న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ప్రభుత్వరంగ సంస్థ భెల్ డైరెక్టర్‌గా బాని వర్మ నియమితులయ్యారు. గతంలో భెల్ రవాణా వ్యాపారంతోపాటు ఎలక్ట్రానిక్స్ డివిజన్ యూనిట్‌ను నిర్వహించినట్టు కంపెనీ పేర్కొంది.
ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన వర్మ..1990లో భెల్‌లో తన కేరియర్‌ను ప్రారంభించారు. ఎనర్జీ, ఇండస్ట్రీ, రవాణా విభాగాల్లో 33 ఏండ్ల అనుభవం కలిగివున్నారు.