Bajaj CT 125X Bike | బజాజ్ ఆటో నుంచి కొత్త బైక్.. ఫోన్ చార్జింగ్ సాకెట్ ఫెసిలిటీ హియర్!
Bajaj CT 125X Bike | బజాజ్ ఆటోమొబైల్ త్వరలో సీటీ125 ఎక్స్ బైక్ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. దీని ధర రూ.78 వేలు ఉండొచ్చు.
Bajaj CT 125X Bike | ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్.. దేశీయ మార్కెట్లోకి సీటీ, సీటీ 125 ఎక్స్ వంటి అత్యధిక మైలేజీనిచ్చే బైక్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇది 125 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో వెలుగులోకి రాబోతున్నది. ఇదే ఇంజిన్ ఆప్షన్‌తో బజాజ్ ప్లాటినా కూడా కొనుగోలు చేయొచ్చు. సీటీ 125 ఎక్స్ తరహాలో ఉండే ఈ కొత్త బైక్‌లో మొబైల్ చార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. అంటే, బైక్‌తో మొబైల్ ఫోన్‌ను చార్జింగ్ చేసుకోవచ్చు.
సుదీర్ఘకాలంగా బజాజ్.. 125 సీసీ సెగ్మెంట్ బైక్‌లు విడుదల చేయలేదు. ఈ సెగ్మెంట్లో పట్టు పెంచుకునేందుకు సీటీ 125 ఎక్స్ బైక్‌ను తేవడానికి సిద్ధమైంది. మరోవైపు 300 సీసీ నుంచి 500 సీసీ సెగ్మెంట్ల వరకు బైక్‌ల తయారీకి సిద్ధంగా ఉంది. ఇంందుకోసం బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న ట్రయంఫ్ సంస్థతో జత కలిసింది. రెండు కంపెనీలు కలిసి కొన్ని పవర్ఫుల్ బైక్‌లను మార్కెట్లోకి తేనున్నాయి.
బజాజ్ సీటీ 110 ఎక్స్ ధర రూ.66 వేలు. అయితే, బజాజ్ సీటీ 125ఎక్స్ ధర రూ.76 వేల నుంచి రూ.78 వేల మధ్య ఉండొచ్చు. భారత్ మార్కెట్లో హోండా సీడీ 110 డ్రీమ్, టీవీఎస్ రాడియన్, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ బైక్‌లతో తల పడనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bajaj
- Business news
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

