T Hub | హైదరాబాద్ : స్పేస్ టెక్ రంగంలో స్టార్టప్‌లకు విదేశాల్లోనూ అవకాశాలను మెరుగుపర్చేందుకు టీహబ్‌లో బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్ట్రేలియా – ఇండియా స్పేస్ అలియన్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్పేస్ టెక్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 8 స్టార్టప్‌లతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆస్ట్రేలియా ప్రతినిధులు స్పేస్ టెక్ స్టార్టప్‌ల ప్రతినిధులతో చర్చించారు. రెండు దేశాల్లో స్పేస్ టెక్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆస్ట్రేలియా – ఇండియా స్పేస్ అలియన్స్ దోహదం చేస్తుందని టీ హబ్ ప్రతినిధి తెలిపారు.