న్యూఢిల్లీ, నవంబర్ 30: హైదరాబాద్ ఆధారిత అరబిందో ఫార్మా.. తమ అనుబంధ సంస్థ యుగియా ఫార్మా స్పెషాలిటీస్కు జనరిక్ ఆస్తమా మెడికేషన్ మార్కెటింగ్ కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి తుది ఆమోదం లభించినట్టు గురువారం తెలియజేసింది. పిల్లల్లో ఆయాసం చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగిస్తారన్నది.
కాగా, ఆస్ట్రజెనెకా ఫార్మాస్యూటికల్స్ ఎల్పీకి చెందిన పల్మీకార్ట్ రెప్సుల్స్ ఇన్హలేషన్ సస్పెన్షన్కు మా ఈ ఔషధం చికిత్సాపరంగా సరిమానమని సంస్థ ఈ సందర్భంగా పేర్కొన్నది. ఇదిలావుంటే అరబిందో ఫార్మా హెచ్ఐవీ జనరిక్ ఔషధానికీ యూఎస్ఎఫ్డీఏ ఇటీవల అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.