న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మాకు చెందిన మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి(యూఎస్ఎఫ్డీఏ) అనుమతినిచ్చింది. వంశపారంపర్యంగా వచ్చే రోగాల చికిత్సకోసం వినియోగించే ఆంజియోడెమో ‘జనరిక్ ఇకాటిబాండ్ ఇంజెక్షన్’ను అక్కడి మార్కెట్లో ఉత్పత్తి చేయడంతోపాటు విక్రయించడానికి లైన్ క్లియర్ అయింది. ఈ ఇంజెక్షన్ 30 ఎంజీ(3 ఎంల్) సింగిల్ డోజ్ తో రూపొందించింది. అనుమతించ్చిన ఉత్పత్తి మార్కెట్ విలువ 137 మిలియన్ డాలర్లు కావడం విశేషం.