హైదరాబాద్ రియల్ కింగ్
- నగరంలో ఇండ్లకు భలే గిరాకీ..
- జనవరి-మార్చిలో 39% పెరిగిన అమ్మకాలు
- దేశంలోని 8 ప్రధాన నగరాల్లో టాప్..
- కరోనా ఉద్ధృతిలోనూ తగ్గని డిమాండ్

దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ సత్తా చాటుతున్నది. కరోనా ఉద్ధృతిలోనూ ఇండ్ల అమ్మకాల్లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో భాగ్యనగరమే టాప్‌గా నిలిచింది. ప్రముఖ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ తాజా నివేదిక ప్రకారం గతంతో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్ హౌజింగ్ సేల్స్ 39 శాతం పెరిగినట్టు తేలింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వ్యాపార నిర్వహణ సులభతరంగా మారిందని, ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు కలిసొచ్చిందని ప్రాప్‌టైగర్ తమ నివేదికలో పేర్కొన్నది. నిరుడు జనవరి-మార్చిలో 5,554 ఇండ్ల విక్రయాలు జరిగితే, ఈ ఏడాది జనవరి-మార్చిలో 7,721 యూనిట్లు అమ్ముడైనట్టు పేర్కొన్నది. వీటి విలువ రూ.8,400 కోట్లని, గతేడాదితో పోల్చితే 34 శాతం ఎక్కువని పేర్కొన్నది.
హైదరాబాద్, మే 21: ఇండ్ల అమ్మకాల్లో హైదరాబాద్ దూసుకుపోతున్నది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో భాగ్యనగరమే టాప్ అని ప్రముఖ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ తమ తాజా నివేదిక ‘రియల్ ఇన్సైట్ క్యూ1-2021’లో వెల్లడించింది. గతంతో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్ హౌజింగ్ సేల్స్ 39 శాతం పెరిగినట్లు తేలింది. నిరుడు జనవరి-మార్చిలో 5,554 ఇండ్ల విక్రయాలు జరిగితే, ఈ ఏడాది జనవరి-మార్చిలో 7,721 యూనిట్లు అమ్ముడైనట్లు పేర్కొన్నది. వీటి విలువ రూ.8,400 కోట్లని, గతేడాదితో చూస్తే 34 శాతం ఎక్కువన్నది. ఈ స్థాయిలో దేశవ్యాప్తంగా ఇతర ఏ ప్రధాన నగరాల్లో అమ్మకాలు లేవని స్పష్టం చేసింది. యావత్ మార్కెట్‌ను కరోనా వైరస్ షేక్ చేస్తున్నా.. హైదరాబాద్ రియల్టీపై ఆ ప్రభావం కనబడకపోవడం గమనార్హం. కొండాపూర్, కొంపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, మియాపూర్, బాచుపల్లి, సంగారెడ్డిల్లో ఇండ్లకు జోరుగా డిమాండ్ కనిపించిందని ప్రాప్‌టైగర్ తెలిపింది. కూకట్పల్లి, నిజాంపేట్‌లలో రూ.50 లక్షలలోపు ఇండ్లకు గిరాకీ ఉంటే.. కొండాపూర్, మియాపూర్, కొంపల్లిల్లో రూ.50 లక్షలు-కోటి రూపాయల మధ్య డిమాండ్ వ్యక్తమవుతున్నది.

- ఈ జనవరి-మార్చిలో మొదలైన 7,604 యూనిట్లు. నల్లగండ్ల, కొంపల్లి ప్రాంతాల్లో పెరిగిన నిర్మాణాలు.
- రూ.75 లక్షలకుపైగా విలువచేసే ఇండ్లకు గిరాకీ. రూ.45-75 లక్షల్లోని ఇండ్లకూ డిమాండ్
- 48 శాతం పెరిగిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు. త్రిబుల్ బెడ్రూం ఇండ్ల కొనుగోలుకూ హైదరాబాదీలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు.
- నిర్మాణం పూర్తయ్యాక 25 నెలల్లోగా అమ్ముడవుతున్న హైదరాబాద్ ఇండ్లు. ఇతర నగరాల్లోనైతే 3-5 ఏండ్ల సమయం
- కరోనా విజృంభణ, లాక్డౌన్ల నేపథ్యంలో ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇండ్ల గిరాకీ పడిపోవచ్చన్న అంచనాలు
- వైరస్ అదుపు, పండుగ సీజన్లతో జూలై-డిసెంబర్లో పరిస్థితులు చక్కబడవచ్చన్న ఆశాభావం
‘వ్యాపారాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయి. ముఖ్యంగా టీ-ఐపాస్, ఐసీటీ పాలసీలు వ్యాపార నిర్వహణను సులభతరం చేశాయి. అందువల్లే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది’తాజా నివేదికలో ప్రాప్‌టైగర్
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- housing sales
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

