Ashneer Grover | అశ్నీర్ గ్రోవర్ దంపతులకు షాక్.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నిలిపివేత
Ashneer Grover | భారత్ పే మాజీ సహ వ్యవస్థాపకుడు అశ్ నీర్ గ్రోవర్ దంపతులు న్యూయార్క్ వెళ్లకుండా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
Ashneer Grover | యూపీఐ పేమెంట్స్ ఆధారిత మొబైల్ యాప్ ‘భారత్‌పే (BharatPe)’ మాజీ సహ వ్యవస్థాపకుడు అశ్నీర్ గ్రోవర్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తన భార్య మాధురి జైన్‌తో కలిసి గురువారం న్యూయార్క్ వెళ్లాలని భావించిన అశ్నీర్ గ్రోవర్ (Asneer Grover)ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అడ్డుకున్నారు. ఢిల్లీ పోలీసు ఎకనమిక్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అభ్యర్థన మేరకు లుక్ఔట్ నోటీసు జారీ చేయడంతో అశ్నీర్ గ్రోవర్ దంపతులను అడ్డుకున్నట్లు విమానాశ్రయ అధికారులు చెప్పినట్లు శుక్రవారం ఓ ఆంగ్ల దినపత్రిక తెలిపింది.
రీసైలెన్స్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని ‘భారత్ పే’ నిధులను దుర్వినియోగం చేశారని అశ్నీర్ గ్రోవర్ దంపతులను ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. భారత్‌పేలో అశ్నీర్ గ్రోవర్ కుటుంబం రూ.81 కోట్లు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని అభియోగాలు ఉన్నాయి.
భారత్‌పే కంపెనీతో పని చేసిన కొన్ని హ్యుమన్ రీసోర్స్ (హెచ్ఆర్) కంపెనీలు.. ఆ కంపెనీ నిధులను మళ్లించడానికి ఉపయోగించినట్లు తెలుస్తోంది. భారత్‌పే ‘ఇన్వాయిస్’ల్లో తేడాలు ఉన్నాయని ఢిల్లీ పోలీస్ ఈవోడబ్ల్యూ.. గతవారం ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌లో పేర్కొంది. వెనుకటి తేదీతో నియామకాలు జరిపినట్లు చూపినట్లు, ఇందులో ఐదు కంపెనీలు భాగస్వాములు అయ్యాయని సమాచారం. ఇన్ వాయిస్ తేదీల తర్వాత బ్యాంకు ఖాతాలను తెరిచారని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

