Apple vs OpenAI : గోప్యత విషయంలో టెక్‌సంస్థలు (Tech Companies) అయిన యాపిల్ (Apple)- ఓపెన్ ఏఐ (OpenAI) మధ్య నెలకొన్న పోటీ ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ఓపెన్ ఏఐపై యాపిల్ కంపెనీ దావా వేసింది. ఓపెన్ ఏఐ సంస్థ తమ వాణిజ్య రహస్యాల (Trade Secrets) ను దొంగలించిందని తన దావాలో ఆరోపించింది. ఓపెన్ ఏఐతో సహా యాపిల్‌లో పనిచేసిన ఇద్దరు మాజీ ఉద్యోగుల (Ex Employees) పైనా చట్టపరమైన చర్యలకు దిగింది.
డిజైనింగ్, తయారీ ప్రక్రియ, సప్లయ్ చైన్ వ్యూహాలతో సహా యాపిల్ కంపెనీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని మొత్తం తెలుసుకునేందుకు వారంతా కలిసి పనిచేశారని సదరు కంపెనీ ఆరోపించింది. తమ సంస్థ నుంచి వెళ్లిపోయేటప్పుడు ఆ ఉద్యోగులు కంపెనీ ల్యాప్‌టాప్‌లను తిరిగి ఇవ్వలేదని యాపిల్ సంస్థ తెలిపింది. ఆ తర్వాత అందులోని ఓ బగ్ సాయంతో తమ ఇంటర్నల్ నెట్‌వర్క్‌లోకి చొరబడి సున్నితమైన రహస్యాలను తెలుసుకున్నారని తన దావాలో పేర్కొన్నది.