హైదరాబాద్‌లో మరో ప్యాక్టెరా క్యాంపస్
- ప్రారంభించిన అమెరికా సంస్థ
హైదరాబాద్, ఆగస్టు 9: అమెరికాకు చెందిన డిజిటల్, టెక్నాలజీ సేవల సంస్థ ప్యాక్టెరా ఎడ్జ్…హైదరాబాద్‌లో మరో క్యాంపస్‌ను ఆరంభించింది. కంపెనీ సీఈవో వెంకట్ రంగాపురం మంగళవారం ఈ సెంటర్‌ను లాంచనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వచ్చే ఏడాదిన్నరలోగా మరో 1,500 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లో ఉన్న సెంటర్లలో 1,500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తునానరు. కేవలం ముగ్గురు ఉద్యోగులతో 2018లో హైదరాబాద్‌లో ఆఫీస్‌ను ఆరంభించిన సంస్థ అనతి కాలంలో 1,500 మందికి పెంచుకున్నదన్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో మరో క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఎక్కడ ఏర్పాటు చేసే విషయంపై స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
- ఫార్చ్యూన్ 500లో ఉన్న సంస్థలకు ఐటీ, డాటా సేవలు అందిస్తున్నది.
- 2021-22లో అంతర్జాతీయంగా సంస్థ కు 200 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.
- గడిచిన నాలుగేండ్లుగా సంస్థ 33 శాతం వృద్ధిని సాధిస్తున్నది.
- 2025 నాటికి తన సిబ్బంది సంఖ్యను 5 వేలకు పెంచుకోవాలనుకుంటున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

