MG Hector Blackstorm | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన ఎస్యూవీ ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఫైవ్, సిక్స్, సెవెన్ సీటర్ కాన్ఫిగరేషన్లలో వస్తున్న ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్.. బ్లాక్ కలర్డ్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ థీమ్ ఆధారంగా డిజైన్ చేశారు. డార్క్ క్రోమ్ ఆర్గ్యేల్ ఇన్స్పైర్డ్ డైమండ్ మెష్ ఫ్రంట్ గ్రిల్లె, స్కిడ్ ప్లేట్లపై డార్క్ క్రోమ్ ఇన్సర్ట్స్, డార్క్ క్రోమ్ టైల్ గేట్ గార్నిష్, బాడీ సైడ్ క్లాడింగ్‌పై డార్క్ క్రోమ్ ఫినిష్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రెడ్ కాలిపర్స్‌తోపాటు 18-అంగుళాల ఆల్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, పియానో బ్లాక్ రూఫ్ రెయిల్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ విత్ పియానో బ్లాక్ బెజెల్, స్మోక్డ్ కనెక్టింగ్ టెయిల్ లైట్స్ వంటి ఆకర్షణీయ ఫీచర్లతో ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ వస్తున్నది.
ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ కారు కన్సోల్, డాష్ బోర్డుపై గన్ మెటల్ గ్రే ఫినిష్, 14 అంగుళాల హెచ్డీ పోర్ట్రైట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యుయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ హార్డ్ రెస్ట్‌లో బ్లాక్ స్టోర్మ్ డిబాసింగ్తోపాటు ఆల్ బ్లాక్ లెదర్ అప్హోల్స్టరీ, గన్ మెటల్ ఫినిష్‌తోపాటు లెదర్ రాపింగ్ స్టీరింగ్ వీల్ తదితర ఇంటీరియర్ ఫీచర్లు ఈ కారుకు మరింత ప్రీమియం లుక్ అందిస్తాయి. ఇంకా ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫ్లోటింగ్ లైట్ టర్న్ ఇండికేటర్లు, ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఫోన్ చార్జర్, సెగ్మెంట్ ఫస్ట్ డిజిటల్ బ్లూటూత్ కీ, కీ షేరింగ్ కేపబిలిటీ, 100 వాయిస్ కమాండ్లతోపాటు 75కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు జత కలిపారు.
రెండు ఇంజిన్ ఆప్షన్లలో ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా143 పీఎస్ విద్యుత్, 250 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 2.0 లీటర్ల డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 170 పీఎస్ విద్యుత్, 350 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ వేరియంట్ సీవీటీ, డీజిల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక ఐదు సీటర్ల పెట్రోల్ సీవీటీ షార్ప్ ప్రో ఎంజీ హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ వేరియంట్ రూ.21.25 లక్షలు పలికితే, 7- సీటర్ల వేరియంట్ రూ.21.98 లక్షలు, 5-సీటర్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ షార్ప్ ప్రో రూ.21.95 లక్షలు, 7-సీటర్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ షార్ప్ ప్రో రూ.22.76 లక్షలు పలుకుతుంది.