Amazon LayOffs | అమెజాన్‌లో మరోసారి కొలువుల కోత.. అలెక్సా యూనిట్లో వందలమందిపై వేటు
Amazon LayOffs | ప్రముఖ సంస్థల్లో కొలువుల కోత కొనసాగుతోంది. ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా పలు సంస్థలు విడతవారీగా తమ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది (Amazon LayOffs). అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగం (Alexa voice assistant unit) లో కోతలకు తెరతీసింది.
Amazon LayOffs | ప్రముఖ సంస్థల్లో కొలువుల కోత కొనసాగుతోంది. ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా పలు సంస్థలు విడతవారీగా తమ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది (Amazon LayOffs). అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగం (Alexa voice assistant unit) లో కోతలకు తెరతీసింది. లేఆఫ్స్‌కు సంబంధించి సదరు ఉద్యోగులకు సంస్థ మెయిల్ ద్వారా సమాచారం అందించింది.
మారిన వాణిజ్య ప్రాధాన్యాలు, జనరేటివ్ ఏఐపై దృష్టి మళ్లించడం తదితర కారణాలతో అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో సిబ్బందిని తొలగిస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ విభాగంలో కొన్ని వందల మందిని తొలగిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఎంతమందికి ఉద్వాసన పలికారో వెల్లడించేందుకు సదరు ప్రతినిధి నిరాకరించారు.
లేఆఫ్స్‌పై అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ రౌష్ మాట్లాడుతూ.. ఉత్పాదకతను పెంచుకోవడానికి కృత్రిమ మేధస్సు ఆధారితమైన సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ విభాగంలో కొత్త మార్పులు తీసుకురావడానికి ఖర్చు తగ్గింపుతో పాటు, వ్యాపార ప్రాధాన్యతలను మరింత పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Also Read..
Mohammed Shami | షమీ ఓ మంచి ఆటగాడిలానే.. మంచి భర్త అయ్యుంటే బాగుండేది : మాజీ భార్య సంచలన కామెంట్స్
Naga Chaitanya | సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నాగచైతన్య
Dog Bites | ఆస్ట్రియా ప్రధానిని కరిచిన మాల్డోవా అధ్యక్షురాలి పెంపుడు శునకం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

