Future- Amazon | ఫ్యూచర్‌కు అమెజాన్ వార్నింగ్.. బట్ ఇలా స్నేహ హస్తం!
Future-Amazon | తమ ఆమోదం లేకుండా ఫ్యూచర్ రిటైల్ ఏం చేసినా అది చట్ట ఉల్లంఘనే అవుతుందని అమెజాన్ హెచ్చరించింది.

Future- Amazon | గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. దేశీయ రిటైల్ నెట్వర్క్ చైన్ ఫ్యూచర్ రిటైల్‌కు గట్టి హెచ్చరికే చేసింది. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ (ఎఫ్ఆర్ఎల్) ఆస్తుల బదిలీ, విక్రయించకుండా ఫ్యూచర్ గ్రూప్‌పై నిషేధం ఉందని పేర్కొంది. తమ ఆమోదం లేకుండా స్మాల్ ఫార్మాట్ స్టోర్లను విక్రయించాలని ప్రయత్నిస్తే ఇంజక్షన్ ఆర్డర్లను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. స్వతంత్ర డైరెక్టర్లతోపాటు ఎఫ్ఆర్ఎల్ పూర్తికాల డైరెక్టర్లపైనే ఎఫ్ఆర్ఎల్ నిర్వహణ బాధ్యత ఉందని పేర్కొంది. అదే సమయంలో సమర్థవంతమైన సొల్యూషన్స్‌తో ఆర్థికంగా సమస్యల్లో చిక్కుకున్న ఎఫ్‌ఆర్‌ఎల్‌ను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అమెజాన్ తెలిపింది. ఈ మేరకు ఫ్యూచర్ రిటైల్ సంస్థకు లేఖ రాసింది.
స్మాల్ ఫార్మాట్ స్టోర్ల విక్రయానికి ఫ్యూచర్ ఇలా
ఈ నెల ప్రారంభంలో ఫ్యూచర్ రిటైల్ తన రూ.3,494.5 కోట్ల రుణ బకాయిలను చెల్లించడానికి స్మాల్ ఫార్మాట్ స్టోర్లను అమ్మకానికి పెట్టిందని వార్తలొచ్చాయి. గత నెల 31 నాటికి రుణదాతలైన బ్యాంకులకు వాయిదా చెల్లింపుల్లో విఫలమైన నేపథ్యంలో ఫ్యూచర్ రిటైల్.. తన స్మాల్ ఫార్మాట్ స్టోర్ల విక్రయానికి ప్రతిపాదించిందని వార్తలొచ్చాయి.
రిలయన్స్‌తో ప్యూచర్ డీల్ ఇదీ
అప్పుల ఊబిలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్.. 2020 ఆగస్టులో రూ.24,713 కోట్ల మొత్తానికి రిలయన్స్ రిటైల్‌లో విలీనానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, 2019లోనే ఫ్యూచర్స్ కూపన్స్‌లో పెట్టుబడులు పెట్టినప్పుడు.. కుదిరిన ఒప్పందం ప్రకారం భవిష్యత్‌లో ఫ్యూచర్ ఆస్తులను అమెజాన్‌కే విక్రయించాల్సి ఉంటుంది. దీని ప్రకారం 2019 ఒప్పందాన్ని ఉల్లంఘించి 2020 ఆగస్టులో రిలయన్స్‌లో విలీనానికి ఫ్యూచర్ మరో ఒప్పందం కుదుర్చుకుందని అమెజాన్ ఆరోపించింది. సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో అమెజాన్ పిటిషన్ వేసింది. తదుపరి రిలయన్స్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనాన్ని నిలిపివేస్తూ 2020 అక్టోబర్‌లో అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
ఫ్యూచర్-అమెజాన్ డీల్‌పై సీసీఐ ఇలా..
2019లో అమెజాన్-ఫ్యూచర్ మధ్య కుదిరిన ఒప్పందానికి గతంలో ఇచ్చిన ఆమోదాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రకటించింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు.. సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం (ఎస్ఐఏసీ) అత్యవసర ఆదేశాలపై స్టే విధించింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేసింది. సింగపూర్ న్యాయస్థానం ఆదేశాలు చెల్లుబాటవుతాయని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

