హైదరాబాద్, మార్చి 13: అంతర్జాతీయ మెడికల్ పరికరాల సంస్థ అలైన్ టెక్నాలజీ..భారత్లో వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్లో ఇన్నోవేషన్ సెంటర్ను నెలకొల్పింది. హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీలక్ష్మీ కొల్లి, సీనియర్ డైరెక్టర్ శ్రీని పెండాల ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ మాట్లాడుతూ..ఐటీ రంగంలో ప్రతిభ అత్యధికంగా కలిగివున్న హైదరాబాద్లో ఈ నూతన ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించడంతో నూతన ఆవిష్కరణలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా ఒప్పందాలు జరగడానికి ఈ ఏఐసీ సెంటర్ కీలకంకానున్నదన్నారు.