ఒక్క మాట ఖరీదు రూ.25 లక్షల కోట్లు.. ఏడాదిలోనే ఆవిరైన సంపద
Jack Maa: నోటి మాట ఎంతో విలువైంది. కొన్ని మాటలు మనిషికి గొప్ప పేరు తెచ్చిపెడుతాయి. మరికొన్ని మాటలు అదే మనిషిని మూర్ఖుడిగా నిలబెడుతాయి. కొన్ని మాటలు మనిషికి

న్యూఢిల్లీ: నోటి మాట ఎంతో విలువైంది. కొన్ని మాటలు మనిషికి గొప్ప పేరు తెచ్చిపెడుతాయి. మరికొన్ని మాటలు అదే మనిషిని మూర్ఖుడిగా నిలబెడుతాయి. కొన్ని మాటలు మనిషికి లాభాలు తెచ్చిపెడుతాయి. మరికొన్ని మాటలు అదే మనిషిని నష్టాలపాలు చేస్తాయి. చైనాకు చెందిన బిలియనీర్, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఏడాది క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయేలా చేశాయి. చైనా ప్రభుత్వ ఆగ్రహానికి గురై భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది.
2020, అక్టోబర్లో చైనాలో ‘ది బండ్ సమిట్’ పేరుతో ఓ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న జాక్ మా ఓ ప్రసంగం చేశారు. అందులో చైనా ఆర్థికవ్యవస్థలోని లోపాలను ఉతికి ఆరేశారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలంటూ సలహా ఇచ్చారు. సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు అవసరమని సూచించారు. చైనాలో సచేతనమైన ఆర్థిక విధానాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి రోగికి తప్పుడు ఔషధాలు ఇచ్చినట్లే పనిచేస్తాయని ఘాటు విమర్శ చేశారు.
జాక్ మా చేసిన ఈ వ్యాఖ్యలు ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్కు ఆగ్రహం తెప్పించాయి. అందుకే ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. జాక్ స్థాపించిన యాంట్ గ్రూప్ను ఐపీవోకు వెళ్లకుండా అడ్డుకుంది. దాంతో స్టాక్ మార్కెట్లలో అలీబాబా షేర్లు వరుసగా పతనమవుతూ వచ్చాయి. అందుకే అలీబాబా గ్రూప్ సంపదతోపాటు జాక్ మా నికర సంపద కూడా హారతికర్పూరంలో కరుగుతూ పోయింది.
పర్యవసానంగా ఏడాది కాలంలోనే అలీబాబా తన మార్కెట్ విలువలో 344 బిలియన్ డాలర్లను కోల్పోయింది. అంటే మన భారత కరెన్సీలో 25 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ఈ విషయాన్ని బ్లూమ్బర్గ్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ విలువ కూడా ఒక ఏడాదిలో ఇంతలా కరిగిపోలేదట. కాగా, జాక్ మా మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, చైనా ప్రభుత్వ నియంతృత్వ ధోరణివల్ల ఆయన తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Ali Baba Group
- china
- jack maa
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

