నయా డిజిటల్ స్టోర్ అజియోగ్రామ్
దేశీయ ప్రీమియర్ లైఫ్‌ైస్టెల్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ఫ్యాషన్ ఈ-కామర్స్ సంస్థ అజియో.. డీ2సీ ఆధారిత ఈ-కామర్స్ వేదిక అజియోగ్రామ్ను గురువారం ప్రకటించింది. భారతీయ ఫ్యాషన్ స్టార్టప్స్ సాధికారత లక్ష్యంగా ఈ డిజిటల్ స్టోర్‌ను పరిచయం చేస్తున్నట్టు అజియో ఓ ప్రకటనలో తెలియజేసింది.
- ఫ్యాషన్ స్టార్టప్‌లే లక్ష్యంగా ప్రకటించిన అజియో
బెంగళూరు, నవంబర్ 2: దేశీయ ప్రీమియర్ లైఫ్‌ైస్టెల్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ఫ్యాషన్ ఈ-కామర్స్ సంస్థ అజియో.. డీ2సీ ఆధారిత ఈ-కామర్స్ వేదిక అజియోగ్రామ్ను గురువారం ప్రకటించింది. భారతీయ ఫ్యాషన్ స్టార్టప్స్ సాధికారత లక్ష్యంగా ఈ డిజిటల్ స్టోర్‌ను పరిచయం చేస్తున్నట్టు అజియో ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం మార్కెట్లో తమ సరికొత్త ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ఫ్యాషన్ స్టార్టప్‌లు నానా ఇబ్బందులు పడుతున్నాయని అజియో సీఈవో వినీత్ నాయర్ అన్నారు. వాటన్నిటికీ తమ అజియోగ్రామ్ ఓ చక్కని వేదిక కాగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు.
ఇక అజియో యాప్ నుంచి అజియోగ్రామ్కు కస్టమర్లు అనుమతిని పొందవచ్చన్న ఆయన.. వచ్చే ఏడాదికల్లా 200 ఎక్స్‌క్లూజివ్ ఇండియన్ ఫ్యాషన్, లైఫ్‌ైస్టెల్ డీ2సీ (డైరెక్ట్ టు కస్టమర్) బ్రాండ్లను అజియోగ్రామ్ వేదికపైకి తేవాలనుకుంటున్నట్టు తెలిపారు. స్త్రీ, పురుషుల దుస్తులు, పాదరక్షలు, ఇతరత్రా యాక్ససరీస్ బ్రాండ్లన్నీ అజియోగ్రామ్ ప్లాట్‌ఫామ్‌పై ఉంటాయన్నారు. అర్బన్ మంకీ, సూపర్వేక్, క్విర్క్స్మిత్, కేఆర్ఏ లైఫ్ వంటి బ్రాండ్ల ఉత్పత్తులు అజియోగ్రామ్పై మాత్రమే లభిస్తాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Ajio
- AJIOGRAM
- fashion startups
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

