26 నుంచి ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్ పెంపు : వార్షిక ప్లాన్లకు కస్టమర్ల మొగ్గు!

న్యూఢిల్లీ : ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌ను నవంబర 26 నుంచి పెంచనున్నట్టు ప్రకటించింది. యూజర్ నుంచి సగటు రాబడి (ఏఆర్పీయూ)ని మెరుగుపరిచేందుకు టారిఫ్ పెంపును చేపట్టామని ఎయిర్టెల్ వెల్లడించింది. ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్, జియో సైతం త్వరలో తమ టారిఫ్‌లను పెంచవచ్చని భావిస్తున్నారు. ఎయిర్టెల్ టారిఫ్ పెంపుతో కస్టమర్లు నవంబర్ 26లోగా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ లేదా పలు ప్రయోజనాలతో కూడిన యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఎంచుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.
1.5జీబీ, 2జీబీ డైలీ డేటా ప్లాన్స్ వాడేవారు తక్కువ ధరకు లభించే ఎయిర్టెల్ యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్లకు మారడం మేలు. రూ 1498 యాన్యువల్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తున్న ఎయిర్టెల్ ఈ ప్లాన్‌ను రూ 1799కి పెరగనుంది. ఈ ప్లాన్‌లో 24జీబీ డేడా రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిడెట్ కాలింగ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇక రూ 2498 యాన్యువల్ ప్లాన్‌లో 2జీబీ డైలీ డేటా, అన్లిమిడెట్ కాల్స్ 365 రోజుల వ్యాలిడిటీ అందుబాటులో ఉండగా ఈ ప్లాన్ రూ 500 భారం కానుంది. ఇక ఎయిర్టెల్ ప్రస్తుతం అందిస్తున్న రూ 2698 ప్లాన్‌లో 2జీబీ డైలీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 365 రోజుల వ్యాలిడిటీతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్ర్కిప్షన్ లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

